పత్తి కొనుగోళ్లపై రైతులను ఇబ్బంది పెట్టొద్దు, సీసీఐ సీఎండీకి మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ

Minister Singireddy Niranjan Reddy Writes a Letter to CCI CMD Over Cotton Procurement,Minister Singireddy Niranjan Reddy,Niranjan Reddy,Mango Newws,Mango News Telugu,Minister Urges CCI To Lift Procurement Restrictions Till Jan End,CCI CMD,Cotton Procurement,Cotton,Cotton Corporation of India,Chairman and Managing Director of CCI,Agriculture Minister Singireddy Niranjan Reddy,Minister Urges CCI To Lift Procurement,Minister Urges CCI To Lift Procurement Restrictions,Telangana,Telangana News,Telangana Latest News,Telangana Cotton Procurement,Telangana Minister Singireddy Niranjan Reddy,Singireddy Niranjan Reddy Latest News

పత్తి రైతులను ఇబ్బంది పెట్టొద్దని, పత్తి కొనుగోళ్లపై తాజాగా సీసీఐ విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని కోరుతూ సీసీఐ సీఎండీకి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లేఖ రాశారు. “గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రైతులు పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. అయితే వరంగల్, మహబూబ్ నగర్ రీజియన్లలో రోజుకు 15 వేల బేళ్లు, ఆదిలాబాద్ రీజియన్ లో రోజుకు 10 వేల బేళ్లు మాత్రమే కొనాలని సీసీఐ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇది కీలక సమయం కాబట్టి జనవరి నెలాఖరు వరకు సీసీఐ ఆంక్షలన్నీ ఎత్తేయాలి. నిలువ సామర్ద్యం ఉన్న కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది లేదు. నిలువ సామర్ద్యం లేని కొనుగోలు కేంద్రాలు ఉన్న చోట నుండి సమీప కేంద్రాలకు రైతులను మళ్లించే విధంగా చర్యలు తీసుకుంటాం కాబట్టి ఆంక్షలు విధించనవసరం లేదు. ఈ సమయంలో ఆంక్షలు విధించడం వల్ల రైతులు ఆందోళనకు గురికావడం, మద్దతుధర దక్కదన్న భయానికి లోనయ్యే అవకాశం ఉంది” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 11 =