తెలంగాణలో ఖాళీగా 6 ఎమ్మెల్సీ స్థానాలు.. రేసులో ఉంది ఎవరంటే..?

6 Vacant MLC Seats In Telangana Who Is In The Race,6 Vacant MLC Seats In Telangana,Seats In Telangana Who Is In The Race,Who Is In The Race,Telangana, MLC, Padi kaushik Reddym Kadiyam srihari, Palla Rajeshwar Rao, Telangana politics, brs, congress,Mango News,Mango News Telugu,Telangana Latest News And Updates,Telangana Political News And Updates,Palla Rajeshwar Rao News Today,Vacant MLC Seats Latest News,Vacant MLC Seats Latest Updates
Telangana, MLC, Padi kaushik Reddym Kadiyam srihari, Palla Rajeshwar Rao, Telangana politics, brs, congress

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఘట్టం పూర్తయింది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ లభించింది. గురువారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు పోటీ చేసి గెలుపొందారు. ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వారు త్వరలో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నారు. అటు గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో భర్తీ కానున్నాయి.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీశారు.  ప్రత్యర్థి ఈటల రాజేందర్ రెడ్డిని ఓడించి కౌశిక్ రెడ్డి విజయం సాధించారు. అటు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా 2027 మార్చి వరకు పదవీకాలం ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు కడియం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వారంతా త్వరలో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నారు.

అయితే ఆ నాలుగు స్థానాలతో పాటు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. అటు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. మరి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ రేసులో అద్దంకి దయాకర్, షబ్బీర్ అలీ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే సీపీఐ నేతలకు కూడా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టనున్నారనే చర్చ కొనసాగుతోంది. మరి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం ఎవరికి ఇస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే..

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 13 =