ముచ్చింతల్ లో ముగింపు వేడుకలు.. చాటిచెప్పిన ‘సమతామూర్తి’ స్ఫూర్తి

హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి కొనసాగుతున్న ఈ వేడుకలు ఈ రోజుతో ముగిశాయి. గత 12 రోజులుగా అశేష భక్తజనాన్ని విశేషంగా ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన ఈ ఆశ్రమం సర్వ మానవ సమానత్వానికి వేదికగా నిలిచింది. ఇక్కడ 216 అడుగుల ‘సమతామూర్తి’ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించటం తెలిసిందే. చినజీయర్ స్వామి ఈరోజు యాగశాలలో సహస్ర కుండాల శ్రీ లక్ష్మీనారాయణ యజ్ఞానికి మహా పూర్ణాహుతి నిర్వహించి.. మహాయాగాన్ని ముగించారు. శ్రీ రామానుజాచార్య స్వర్ణమూర్తి విగ్రహానికి అభిషేకం, తొలి ఆరాధన నిర్వహించారు.

ఈ కార్యక్రమం మొదలైన నాటినుంచి ఎందరో ప్రముఖులు ఇక్కడికి విచ్చేసారు. కేంద్ర స్థాయిలో.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్, తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రులు జగన్, శివరాజ్ సింగ్ చౌహాన్, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్.. తదితరులు పాల్గొన్నారు. వీరే కాకుండా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొనటం తెలిసిందే. పండిట్ రవిశంకర్, బాబా రాందేవ్, డీఆర్డీవో చీఫ్ సతీష్ రెడ్డి.. కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కళ్యాణ్ తదితరులు శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలలో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 11 =