త్వరలో మునుగోడులో కాషాయ జెండా ఎగురుతుంది – తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Telangana BJP State President Bandi Sanjay Interesting Comments on Munugode By-polls, Bandi Sanjay Kumar Interesting Comments on Munugode By-polls, Interesting Comments on Munugode By-polls, Telangana BJP State President Bandi Sanjay Kumar, BJP State President Bandi Sanjay Kumar, Bandi Sanjay Sensational Comments on Munugode By-polls, Bandi Sanjay Kumar, Munugode By-polls, Munugode By Elections, Munugode By-polls News, Munugode By-polls Latest News And Updates, Munugode By-polls Live Updates, Mango News, Mango News Telugu,

మునుగోడు ఉప ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మునుగోడులో కాషాయ జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కిష్టాగూడెంలో నిర్వహించిన బీజేపీ పదాధికారుల సమావేశంలో బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోవర్టు రాజకీయాలు చేసేవారికి మునుగోడు ప్రజలు బుద్దిచెప్తారని పేర్కొన్నారు. సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, ఆయన రాజీనామాతో మునుగోడుకు నిధులు విడుదల చేస్తున్నారని తెలిపారు. కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెప్తారన్న సంజయ్, కాంగ్రెస్ మునిగిపోయే నావ అని ఎద్దేవా చేశారు.

ప్రజలపై నమ్మకంతోనే ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేశారని, ప్రజలే ఆయనను గెలిపిస్తారని సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని, అలాగే ఈ నెల 21న నిర్వహించే మునుగోడు సభకు ప్రజలు భారీ ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి కోసం కాదని, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తెలిపే ఎన్నికని బండి సంజయ్ వెల్లడించారు. ఇక ఇదిలా ఉండగా.. బీజేపీలో ఈనెల 21న చేరేందుకు నిర్ణయించుకున్న రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటికే విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు అదేరోజు మునుగోడులో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్‌ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్న భారీ బహిరంగ సభ ఏర్పాటుకు రాష్ట్ర నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + two =