ఢిల్లీలో ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ భేటీ

Tamil Nadu CM MK Stalin Called on PM Narendra Modi in Delhi Today, Chief Minister MK Stalin Meets Prime Minister Narendra Modi in New Delhi, CM MK Stalin Called on PM Narendra Modi in Delhi Today, Tamil Nadu Chief Minister MK Stalin, CM MK Stalin, Tamil Nadu CM, PM Narendra Modi, CM MK Stalin Delhi Tour, CM MK Stalin Delhi Visit, CM MK Stalin Delhi Tour News, CM MK Stalin Delhi Tour Latest News And Updates, CM MK Stalin Delhi Tour Live Updates, Mango News, Mango News Telugu,

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చినట్టు తెలుస్తుంది. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న నీట్ వ్యతిరేక బిల్లు, జాతీయ విద్యా విధానం-2020 అంశం, కచ్చతీవు దీవిని శ్రీలంక నుంచి స్వాధీనం చేసుకోవడం, కావేరి నదీ జలాల సమస్య సహా పలు అంశాలపై ప్రధానికి స్టాలిన్ విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది.

అనంతరం ప్రధానితో భేటీపై సీఎం స్టాలిన్ ట్వీట్ చేస్తూ, “ప్రధాని మోదీని కలిసి తమిళనాడు అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించాను. చెన్నైలో చెస్ ఒలింపియాడ్‌ను ప్రారంభించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు, ఈ ఈవెంట్‌ను తమిళనాడు నిర్వహించిన గొప్ప విధానాన్ని ప్రధాని ప్రశంసించారు. అలాగే ఇది భారతదేశానికి గర్వకారణమైన క్షణం అని ఆయన తెలియజేశారు”అని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మరియు ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ ను సీఎం స్టాలిన్ కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here