రాష్ట్ర పోలీసు శాఖలో 3,966 నూతన ఉద్యోగ నియామకాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

Telangana Cabinet Approves 3966 New Posts Recruitment in the State Police Department,Telangana State Police,3966 New Posts Recruitment,Drugs Test Inspector,Mango News,Mango News,Mango News Telugu,Telangana Government,Telangana Govt Jobs 2022,Telangana Govt Jobs,Telangana Govt Jobs News And Live Updates,Telangana Govt Jobs Notification,Telangana Govt Jobs Notifications 2022,Telangana Govt Notifications 2022,State Police Department,3966 New Police Posts

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులలో, నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో నేరాల అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.

నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదకద్రవ్యాలు యువత భవిష్యత్ ను దెబ్బతీస్తూ శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయని, కేబినెట్ చర్చించింది. డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని హోంశాఖను కేబినెట్ ఆదేశించింది. వీటితోపాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు, పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్ లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =