తెలంగాణలో రాష్ట్ర వన్యప్రాణి మండలి ఏర్పాటు

CM KCR Latest News, Mango News Telugu, New Council For Wildlife Conservation, Political Updates 2019, Telangana Breaking News, Telangana CM KCR, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, Telangana Wildlife Conservation
తెలంగాణ రాష్ట్రంలో వన్య ప్రాణుల సంరక్షణ కోసం రాష్ట్ర వన్యప్రాణి మండలిని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మండలికి సీఎం కేసీఆర్ ఛైర్మన్‌గా, రాష్ట్ర అటవీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వైస్ ఛైర్మన్‌గా ఉంటారు. ఈ మేరకు డిసెంబర్ 18, బుధవారం నాడు అటవీ, పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వన్యప్రాణి మండలిలో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కోనేరు కోనప్ప, మర్రి జనార్దన్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు. వీరితో పాటుగా ఆసిఫాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవా లక్ష్మి, పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, పలు ఎన్జీవోల ప్రతినిధులు ఉన్నారు. వీరంతా మూడేళ్లపాటు వన్యప్రాణి మండలిలో సభ్యులుగా కొనసాగనున్నారు. అలాగే ప్రతి సంవత్సరం రెండుసార్లు ఈ మండలి సమావేశం అవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here