సెర్ప్‌, ఐకేపీ, మెప్మా సిబ్బందికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు: సీఎం కేసీఆర్

Telangana CM KCR Speech at Assembly During Appropriation bill-2022 Debate, CM KCR Speech at Assembly During Appropriation bill-2022 Debate, Appropriation bill-2022 Debate, Telangana Appropriation bill-2022 in Assembly Today, CM KCR Introduces Telangana Appropriation bill-2022, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Chief minister of Telangana KCR, Kalvakuntla Chandrashekar Rao, 2022-2023 Budget Session, Telangana Budget Session 2022, Telangana Budget Session, TS Budget Session, 2022 Telangana Budget Session, Telangana Assembly Budget Session 2022-23, Telangana Assembly Budget Session 2022, Telangana Assembly Budget Session, Telangana Assembly Budget, Telangana assembly budget session, Telangana Budget 2022-23, Telangana Budget 2022, Telangana Budget, Telangana Assembly, Telangana Assembly, Telangana Assembly Session, Manog News, Mango News Telugu,

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చివరి రోజున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ద్ర‌వ్య వినిమ‌య బిల్లు-2022ను శాస‌న‌స‌భ‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ జరిగిన అనంతరం సీఎం కేసీఆర్ స‌మాధానం ఇస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు కీలక ప్రకటనలు చేశారు. ఉక్రెయిన్ లో పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు కొందరు చదువులు మధ్యంతరంగా వదిలేసి తిరిగి రాష్ట్రానికి చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలంగాణ విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించి, వారిని చదివిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంపై లేఖ రాస్తామని చెప్పారు. అలాగే సెర్ప్‌, ఐకేపీ, మెప్మా సిబ్బందికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ శుభవార్త:

ఇక ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధిహామీలో పని చేస్తారని, వారు ఉద్యోగులు కాదన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ ఎంత చెప్పినా వినకుండా భ్రమలో సమ్మెకు వెళ్లారని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ సమ్మె వంటి పొరపాట్లు చేయవద్దని సీఎం కేసీఆర్‌ కోరారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను మానవతాదృక్పధంతో మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే వీఆర్‌ఏలను ఇరిగేషన్‌ విభాగంలోకి తీసుకుంటామని, స్కేల్‌ ఇచ్చి లషర్క్‌ పోస్టుల్లోకి తీసుకుంటామని అన్నారు. మరోవైపు మార్చి 31 లోగా రాష్ట్రంలో 40 వేల కుటుంబాలకు దళిత బంధు అందిస్తామన్నారు. దళిత బంధుతో పాటు దళిత రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నెలకున్న పోడు భూముల సమస్యను కూడా వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =