టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం

Kalvakuntla Kavitha, Kalvakuntla Kavitha takes oath as Kamareddy & Nizamabad MLC, Kalvakuntla Kavitha Takes Oath As MLC, Kalvakuntla Kavitha Takes Oath As Nizamabad MLC, Kalvakuntla Kavitha Takes Oath As TRS MLC, Kalvakuntla Kavitha taking oath as MLC for Kamareddy, Kamareddy & Nizamabad MLC, Mango News, Telangana CM KCR’s Daughter Kalvakuntla Kavitha, Telangana CM KCR’s Daughter Kalvakuntla Kavitha Takes Oath As TRS MLC, TRS leader Kavitha takes oath as Nizamabad MLC

టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. కవితతో పాటు కె. దామోదర్ రెడ్డి కూడా ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ప్రొటెం చైర్మన్ అమిణుల్ హసన్ జాఫ్రీ వీరిద్దరిచే ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు.. కల్వకుంట్ల కవిత, దామోదర్ రెడ్డిలకు మంత్రి మండలి రూల్స్ బుక్స్ మరియు ఐడి కార్డు అందజేశారు. అనంతరం పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో.. హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు బీబీ పాటిల్, కే ఆర్ సురేష్ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here