రాష్ట్రంలో నేషనల్ హైవేల వెంబడి మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ పై సీఎస్ సమీక్ష

Chief Secretary Somesh Kumar, CS Somesh Kumar, Mango News, Mango News Telugu, Multilayer Avenue Plantation, Multilayer Avenue Plantation In Telangana, Prepare proposals for multi-layer avenue plantation, telangana, Telangana CS, Telangana CS held Meeting with Officials, Telangana CS Somesh Kumar, Telangana Multilayer Avenue Plantation

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల వెంబడి రంగు రంగుల పూల మొక్కలతో ఆహ్లదకర వాతావరణం ఉట్టిపడేలా మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టడానికి తగు ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, ఆర్ అండ్ బి, మున్సిపాలిటీలు, ఓఆర్ ఆర్, పంచాయతీ రాజ్, జాతీయ రహదారుల వెంట మల్టీ లెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టే విషయమై సంబంధిత అధికారులతో శుక్రవారం నాడు సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్లాంటేషన్ చేపట్టవలసిన రోడ్ల విస్తరణ, వివిధరకాల మొక్కలు నాటేందుకు నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. సింగిల్ లేయర్ ప్లాంటేషన్ లో ప్రత్యేక మొక్కలు నాటాలని ఆయన సూచించారు. వివిధ శాఖల సమన్వయంతో జిల్లాలలో రహదారుల వెంబడి మల్టీ లెవల్ ప్లాంటేషన్ విస్తరణ వివరాలతో కూడిన నివేదికలను జిల్లాల వారిగా రూపొందించాలని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పిసిసిఎఫ్ శోభ, పిసిసిఎఫ్ (ఎస్ఎఫ్) డోబ్రియల్, జిహెచ్ఎంసి కమీషనర్ డిఎస్ లోకేశ్ కుమార్, మున్సిపల్ శాఖ సంచాలకులు ఎన్.సత్యనారాయణ, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారిణి ప్రియాంకవర్గీస్, ఆర్డి స్పెషల్ కమీషనర్, వి.ఎస్.ఎన్.వి. ప్రసాద్, పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ సంజీవ్ రావు, రహదారులు, భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ రవీందర్ రావు, జాతీయ రహదారుల విభాగం, జనరల్ మేనేజర్ నాగేశ్వర్ రావు, తదితర అధికారులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + twenty =