తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై అధికారులతో సీఎస్ సమీక్ష

2021 Telangana Assembly Budget Session, Budget Session, Mango News, Telangana Assembly, Telangana Assembly Budget Session, Telangana Assembly Budget Session 2021, Telangana Assembly Budget Session News, Telangana Assembly Budget Session will Start, Telangana Assembly Budget Session will Start From March 15th, Telangana Assembly Budget Sessions, Telangana Assembly Session, Telangana budget session, Telangana Budget Session 2021-2022

మార్చి 15 నుండి జరగబోయే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి తగు నివేదికలతో, సమాయత్తం కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శాసన మండలి, శాసన సభ లో పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలన్నారు. ఈ సమావేశాలలో ఉత్పన్నమయ్యే అల స్పెషల్ మెన్షన్స్, ఎల్ఏక్యూస్, ఎల్సీక్యూస్, అసురన్సుస్ కు సంబంధించిన తగు సమాచారంతో అధికారులు సిద్దంగా ఉండాలని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో బుధవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో శాఖల వారీగా సమన్వయ అధికారులను ఏర్పాటు చేసుకొని అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాలలో శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు జీరో అవర్ లో లేవనెత్తే అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తమ శాఖలకు అందించి, వెంటనే తగుసమయంలో ఆ సమాచారాన్ని వారికి తెలియజేసేందుకు సమన్వయ అధికారులు సిద్దంగా ఉండాలని, అసెంబ్లీ సమావేశాలలో సంబంధిత అధికారులు అందుబాటులో ఉండాలని సీఎస్ పేర్కొన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను కూడా సీఎస్ సమీక్షించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించిన విధంగా ఉద్యోగులకు పదోన్నతులను అతి తక్కువ సమయంలో పూర్తి చేసినందుకు సీఎస్ అధికారులను అభినందించారు. అదే విధంగా భారత స్వాతంత్య్ర 75 వ వార్షికోత్సవ వేడుకలు, కోర్టులలో ఉన్నపెండింగ్ కేసులు, కారుణ్య నియమాకాలకు సంబంధించి ఉత్పన్నమైన అంశాలను, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాణి కుముదిని, శాంతి కుమారి, ముఖ్య కార్యదర్శులు కె.రామకృష్ణారావు, అర్వింద్ కుమార్, సునీల్ శర్మ, వికాస్ రాజ్, రజత్ కుమార్, సబ్యసాచి ఘోష్, రవిగుప్త, కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్.ఏ.ఎం రిజ్వీ, శేషాద్రి, రోనాల్డ్ రోస్, రాహుల్ బొజ్జా, క్రిస్టినా చొంగ్తు, నదీమ్ అహ్మద్, జనార్ధన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, అనితా రాజేంద్ర, శ్రీనివాస రాజు, సర్పరాజ్ అహ్మద్, సంతోష్ రెడ్డి, లా సెక్రటరీ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + eight =