తెలంగాణకు హరితహారం, ధరణిలపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

Additional Collectors, CS Somesh Kumar Held Video Conference with District Collectors, CS Somesh Kumar Held Video Conference with District Collectors Additional Collectors, CS Somesh Kumar Meeting, CS Somesh Kumar Video Conference, CS Somesh Kumar Video Conference with District Collectors, Districts Additional Collectors, Mango News, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar Held Video Conference, Telangana CS Somesh Kumar Held Video Conference with District Collectors Additional Collectors

రాష్ట్రముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్ధానిక సంస్ధలు), డిఎఫ్ఓలు, డిపిఓలు, డిఆర్డిఓలు, మున్సిపల్ కమీషనర్లు ఇతర అధికారులతో స్ధానిక సంస్ధల నిర్వహణ పనితీరులో మెరుగుదల, తెలంగాణకు హరితహారం, ధరణి, వ్యాక్సినేషన్ లపై బుధవారం నాడు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ విజన్ మేరకు అధికారులు పనిచేయాలని, స్ధానిక సంస్ధలలో ఆకస్మీక తనిఖీలు నిర్వహించాలని, గ్రామాలలో రాత్రి బసలు చేసి పారిశుధ్ధ్యం ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, గ్రామసభల నిర్వహణ, ప్రగతి నివేధికల తయారి సీజనల్ క్యాలండర్ తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఈ వరంగల్ నుండి వీడియోకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

రిజర్వు ఫారెస్ట్ బ్లాక్ లలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం, జిల్లాలలో అన్ని రహదారుల వెంట మల్టీలెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్, పట్టణాలలో ఖాళీస్ధలాలలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం, నూతనంగా నిర్మిస్తున్న జిల్లా సమీకృత కార్యాలయ కాంప్లెక్సులలో పచ్చదనం, తదితర అంశాలను సమీక్షించారు. మొక్కలు నాటడానికి గుంతల తవ్వకం, మిగిలిన గ్రామాలలో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటును పూర్తి చేయాలని కలెక్టర్లను కోరారు.

అలాగే ధరణిలో పెండింగ్ ధరఖాస్తుల పరిష్కారం, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు స్ధలాలు అప్పగించడం తదితర అంశాలను చర్చించారు. వ్యాదుల కంట్రోల్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జిహెచ్ ఎంసి కమీషనర్ లోకేశ్ కుమార్, సిఐజి వి.శేషాద్రి, పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, అటవీ శాఖ పిసిసిఎఫ్ శోభ, పిసిసిఎఫ్, (ఎస్ఎఫ్) ఆర్.యం.డోబ్రియల్, సి.యం ఓఎస్డి ప్రియాంకా వర్గీస్, సిడిఎంఏ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 4 =