ఆన్‌లైన్ లో నెహ్రూ జూలాజికల్ పార్క్ సేవ‌లు, వెబ్ సైట్, మొబైల్ యాప్ ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Telangana Forest Minister Indrakaran Reddy Unveils New Website and Mobile App for Nehru Zoo Park,Telangana Forest Minister Indrakaran Reddy,Mobile App for Nehru Zoo Park,Minister Indrakaran Reddy,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

హైదారాబాద్ కు త‌ల‌మానికంగా ఉన్న నెహ్రూ జూలాజిక‌ల్ పార్కు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్, మొబైల్ యాప్ ను రూపొందించినట్లు తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వెబ్ సైట్ లో స‌మ‌స్త సమాచారాన్ని నిక్షిప్తం చేయ‌డంతో పాటు సందర్శకులు సులువుగా జూ ఎంట్రీ టికెట్ బుకింగ్, బ్యాటరీ వెహికల్స్ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి వెల్లడించారు.

సోమవారం అరణ్య భవన్ లో నెహ్రూ జూ పార్క్ యొక్క కొత్త వెబ్ సైట్ మరియు మొబైల్ యాప్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ వెబ్ సైట్ (https://nzptsfd.telangana.gov.in/home.do)
ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించింది. ఈ కార్యక్రమంలో సీజీజీ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే, పీసీసీఎఫ్ అండ్ హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్, అటవీ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రశాంతి, పీసీసీఎఫ్ (ఎఫ్ ఏసీ) ఎం.సీ.పర్గయిన్, జూ పార్క్ డైరెక్టర్ వినయ్ కుమార్, క్యురేటర్ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − three =