ఇంగ్లండ్‌కు తొలి వన్డే ప్రపంచ కప్ అందించిన మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కీలక ప్రకటన.. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్

England World Cup Winning Skipper Eoin Morgan Announces Retirement For All Formats of Cricket,England World Cup Winning,England World Cup,Skipper Eoin Morgan,Eoin Morgan Announces Retirement,Mango News,Mango News Telugu,Eoin Morgan Wife,Eoin Morgan Age,Eoin Morgan Ipl,Eoin Morgan Retired,Eoin Morgan Career,Eoin Morgan Current Teams,Eoin Morgan Ipl 2022,Eoin Morgan Retirement,Eoin Morgan Tweets,Eoin Morgan Net Worth,Eoin Morgan Twitter,Eoin Morgan Ireland,Alex Hales And Eoin Morgan,Has Eoin Morgan Retired,Ashwin And Eoin Morgan

ఇంగ్లండ్‌కు తొలి వన్డే ప్రపంచ కప్ అందించిన మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కీలక ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా గత జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్న మోర్గాన్.. తాజాగా దేశవాళీ క్రికెట్ నుంచి కూడా దూరమవుతున్నట్లు వెల్లడించాడు. అతడు మొత్తం 248 వన్డేలు మరియు 115 టీ20లు ఆడాడు. ఈ క్రమంలో మొత్తం 10,159 పరుగులు చేశాడు. అలాగే 16 టెస్టుల్లో 700 పరుగులు చేశాడు. ఇక మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్న అనంతరం కౌంటీల్లో మిడిల్‌సెక్స్ క్రికెట్ క్లబ్ తరపున ప్రాతినిథ్యం వహించాడు.

ఈ సందర్భంగా ఇయాన్ మోర్గాన్ ట్విట్టర్ ద్వారా ఇలా తెలియజేశాడు.. ‘నేను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నప్పటి నుండి, నేను నా ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపగలిగాను మరియు భవిష్యత్తులో మరింత ఎక్కువ చేయగలనని నేను ఎదురు చూస్తున్నాను. ఇకపై ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటంలో ఉన్న సాహసం మరియు సవాళ్లను నేను నిస్సందేహంగా కోల్పోతాను. ఆట నుండి వైదొలగడానికి ఇదే సరైన సమయం అని నేను నమ్ముతున్నాను. నేను నా క్రీడా జీవితంలో సమయాన్ని వెచ్చిస్తున్నప్పటికీ, నేను అంతర్జాతీయ మరియు ఫ్రాంచైజ్ టోర్నమెంట్‌లలో ప్రసారకర్తలతో కలిసి వ్యాఖ్యాతగా పని చేస్తూ ఆటలో నిమగ్నమై ఉంటాను. భవిష్యత్తు కోసం నేను హృదయపూర్వకంగా ఎదురుచూస్తున్నాను’ అని మోర్గాన్ ట్విట్టర్‌లో ఒక ప్రకటనలో తెలిపాడు.

కాగా మోర్గాన్ 126 వన్డేలు మరియు 72 టీ20లకు ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండు ఫార్మాట్లలో కెప్టెన్‌గా 118 విజయాలు నమోదు చేశాడు. ఇక ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో ఇయాన్ మోర్గాన్ ఒక గేమ్ ఛేంజర్ గా గుర్తింపు పొందాడు. ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోనే ఇంగ్లాండ్ జట్టు 2019 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. అలాగే ఇంగ్లాండ్ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మోర్గాన్ నిలిచాడు. డబ్లిన్‌లో జన్మించిన మోర్గాన్ 2009లో తన 16వ ఏట ఐర్లాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2006 నుండి 2009 వరకు మోర్గాన్ ఐర్లాండ్ తరపున 23 వన్డేలు ఆడి 744 పరుగులు చేయగా, ఇందులో ఒక సెంచరీ మరియు ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అనంతరం మే 2009 నుంచి ఇంగ్లాండ్ తరపున తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. మొత్తం 13 సంవత్సరాలపాటు ఇంగ్లాండ్ క్రికెట్‌కు సేవలు అందించాడు. ‌

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =