అరెస్ట్ సమయంలో నా ఫోన్ పోయింది – పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌

Telangana BJP Chief Bandi Sanjay Files Complaint with Police on Lost His Mobile Phone During Detention,Telangana BJP Chief Bandi Sanjay,Bandi Sanjay Files Complaint,Lost His Mobile Phone During Detention,Mango News,Mango News Telugu,Telangana BJP Chief Bandi Sanjay Latest News and Updates,Telangana BJP Chief Bandi Sanjay Case,Telangana BJP Chief Bandi Sanjay Case Updates,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన టెన్త్ క్లాస్ పేపర్ లీక్ ఘటన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రమేయం ఉందంటూ ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించగా.. కరీంనగర్‌లోని జైలుకు తరలించారు. ఈ క్రమంలో కోర్టు బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. అయితే తాజాగా ఆయన తన ఫోన్ పోయిందని పోలీసులకు పిర్యాదు చేసారు. ఏప్రిల్ 5న అర్ధరాత్రి కరీంనగర్‌లోని నివాసం నుంచి తనను బలవంతంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారని, ఆ సమయంలో తన ఫోన్‌ మిస్‌ అయ్యిందని బండి సంజయ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. అరెస్ట్‌ చేసే క్రమంలో ఎక్కడో పడిపోయిందని, ఆ ఫోన్‌లో చాలా కీలక సమాచారం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఈ మెయిల్ ద్వారా కరీంనగర్‌ టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది తనతో టచ్‌లో ఉన్నారని, ఆ విషయం తెలిసి తన ఫోన్‌ బయటకొస్తే ఇంకెన్ని విషయాలు బయటకొస్తాయోననే అనుమానంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకే పోలీసులు తన ఫోన్ మాయం చేశారని ఆరోపించారు. మరోవైపు పోలీసులు మాత్రం బండి సంజయ్ ఫోన్ తమ దగ్గర ఫోన్‌ లేదని చెబుతున్నారు. కాగా ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ కేసులో కీలక సాక్ష్యమైన బండి సంజయ్‌కు సంబంధించిన ఫోన్ ఉందని, అయితే అడిగితే ఆయన లేదంటున్నారని ఆరోపించారు. కుట్రకోణం లేకపోతే బండి సంజయ్ తన ఫోన్ ఇవ్వొచ్చు కదా అని సీపీ వ్యాఖ్యానించిన సీపీ రంగనాథ్.. దానిని తమకు అప్పగించి విచారణకు సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ తన ఫోన్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + fifteen =