తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై రాష్ట్రంలో 24 గంటలు షాపులు, రెస్టారెంట్లు తెరిచి ఉంచేందుకు అనుమతి

Telangana Govt Issued Orders For Shops and Restaurants To Remain Open For 24 Hours in The State,Telangana Govt Issued Orders For Shops and Restaurants,Shops and Restaurants To Remain Open For 24 Hours,Telangana To Remain Open For 24 Hours in The State,Mango News,Mango News Telugu,Shops can now remain open 24/7,Telangana govt allows 24x7 functioning for shops,Telangana Govt Allows 24x7 Functioning,Telangana goes 24x7,Telangana Shops and Establishments Act,Telangana Govt Latest News and Updates,Telangana News Today

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో దుకాణలు 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే దీనికోసం కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.. 24 గంటలు పనిచేసే సంస్థల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు నైట్‌డ్యూటీలు విధించే విషయంలో వారి అంగీకారం తప్పనిసరి అని స్పష్టం చేసింది. కాగా రాష్ట్రంలోని వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే చర్యల భాగంగా.. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ దుకాణాలు మరియు సంస్థల చట్టం 1988లోని సెక్షన్ 7 (ఓపెనింగ్ మరియు క్లోజింగ్ వేళలు) నుండి మినహాయింపును మంజూరు చేయడానికి అన్ని దుకాణాలు మరియు సంస్థలకు సెక్షన్ 2 (21)లో నిర్వచించిన విధంగా మార్గదర్శకాలను జారీ చేసింది.

ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 24 గంటలు పాటు ఓపెన్ ఉండే వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు ఐడీ కార్డ్‌లు ఇవ్వాలి. వీక్లీ ఆఫ్‌లు, వారపు పని గంటలు, ఓవర్‌టైమ్ వేతనాలు వర్తించే చోట, వేతనానికి బదులుగా పరిహారంతో కూడిన సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అధికారిక సెలవులు, జాతీయ పండుగ దినాలలో విధులకు హాజరయ్యే ఉద్యోగులు, మహిళా ఉద్యోగుల భద్రత, రాత్రి షిఫ్టులలో పని చేయడానికి మహిళా ఉద్యోగుల సమ్మతి మరియు వారికి రవాణా సౌకర్యాన్ని కల్పించడం వంటివి కల్పించాలి. ఇంకా మేనేజ్‌మెంట్‌లు ఈ అంశాలన్నింటికి సంబంధించి ఖచ్చితమైన రికార్డులను నిర్వహించాలి. దీంతో పాటు సమయానికి ఐటీ రిటర్న్‌లను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తమ షాపులు, రెస్టారెంట్లు 24 గంటలు పాటు ఓపెన్ చేసుకునేందుకు వార్షిక రుసుము రూ. 10,000 చెల్లించాల్సి ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + three =