10 రోజులపాటు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, మార్చి 18 న బడ్జెట్

2021 Telangana Assembly Budget Session, Budget Assembly Session, Budget Session, Mango News, Telangana Assembly, Telangana Assembly Budget Session, Telangana Assembly Budget Session 2021, Telangana Assembly Budget Sessions, Telangana Assembly Budget Starts, Telangana Assembly Session, Telangana Budget Assembly session, Telangana budget session, Telangana Budget Session 2021-2022, Telangana Budget Session will End on March 26th, Telangana Govt will Present Budget on March 18

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా శాసనసభ, శాసనమండలిలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీక‌ర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్య‌క్ష‌త‌న శాసనసభ భవనంలోని కమిటీ హాల్లో బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 18 న శాసనసభలో తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మార్చి 26 వరకు మొత్తం 10 పనిదినాలు పాటుగా ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే సభ్యులు అందరూ చర్చలలో పాల్గొనే విదంగా పని గంటలు పెంచి, సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పార్టీలకు మాట్లాడే సమయం కేటాయిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

ఈ బీఏసీ సమావేశానికి రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్ధిక శాఖ మంత్రి టీ.హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, విప్ గొంగడి సునీత, ఎంఐఎం ప్రతినిధి పాషా ఖాద్రి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మల్లు భట్టి విక్రమార్క మరియు లెజిస్లేటివ్ సెక్రటరీ డా.వి.నరసింహ చార్యులు హాజరయ్యారు.

తెలంగాణ బడ్జెట్ సమావేశాల వివరాలు:

  • మార్చి 15 – గవర్నర్ ప్రసంగం
  • మార్చి 16 – మరణించిన సభ్యులకు సంతాపం
  • మార్చి 17 – గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు
  • మార్చి 18 – రాష్ట్ర వార్షిక బడ్జెట్
  • మార్చి 19 – సెలవు
  • మార్చి 20 నుండి ప్రతిరోజూ క్వశ్చన్ అవర్ మరియు జీరో అవర్
  • మార్చి 20 నుండి బడ్జెట్ పై చర్చ
  • మార్చి 21 – సెలవు (ఆదివారం)
  • మార్చి 22 నుండి మార్చి 25 వరకు బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చ‌ర్చ
  • మార్చి 26 – ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చర్చ, ఆమోదం

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 3 =