తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణ, అన్ని ఏర్పాట్లు సిద్ధం

Telangana Tenth Class Examinations Will Be Held From April 3Rd To 13Th Throughout The State,Tenth Class Examinations Will Be Held From April 3Rd,Telangana Tenth Examinations From April 3Rd To 13Th,Tenth Class Throughout The State From April,Mango News,Mango News Telugu,Around 5 Lakh Students To Write Class X Exams,Ts SSC 2023,Telangana Class X Board Exams,Ts SSC Exam Date 2023,Bse Telangana SSC Hall Ticket,Ts SSC Hall Ticket 2023 Released,10Th Class Exam Time Table 2023

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి-2023 పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు జరగనున్నాయి. పదో పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. అలాగే కాంపోజిట్ కోర్సు మరియు సైన్స్ పేపర్ల పరీక్షలు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.50 వరకు జరగనున్నాయి. మొత్తం 2652 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ జరగనుండగా, 4,94,620 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 4,85,826 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారని తెలిపారు.

మరోవైపు పదో తరగతుల పరీక్షలను 11 పేపర్లకు బదులుగా కేవలం ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మార్చి 24 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు హాల్‌ టికెట్లు అందచేశారు. అలాగే ఎస్ఎస్సీ బోర్డు (డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్జామినేషన్స్ తెలంగాణ) వెబ్‌సైట్ www.bse.telangana.gov.in లో కూడా హాల్‌ టికెట్లను అందుబాటులో ఉంచారు. కాగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. డీఈవోలు పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల పరిశీలన పూర్తి చేశారు. పరీక్షా సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్‌ల నియామకం, స్టోరేజీ పాయింట్లకు రహస్య సామగ్రి పంపిణీ మరియు అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పరీక్ష విధులకు నియమించిన సిబ్బందిందరికీ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యింది.

ఆరోగ్య శాఖ ప్రతి పరీక్షా కేంద్రంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు మరియు ప్రథమ చికిత్స కిట్‌లతో పాటు పరీక్షలు జరిగే అన్ని రోజులలో ఒక ఏఎన్‌ఎంను డిప్యూట్ చేయనుంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సమయానికి ఎక్కువ సంఖ్యలో బస్సులను నడుపుతుందని చెప్పారు. ఇక ప్రిపరేషన్ రోజులలో మరియు పరీక్షా కాలంలో విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరాను అందించనుందన్నారు. జిల్లా కలెక్టర్లు, డీఈవోలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు రహస్య సామగ్రిని తరలించేందుకు వాహనాలకు ఎస్కార్ట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్:

  • ఏప్రిల్ 3, 2023 – ఫస్ట్‌ లాంగ్వేజ్ పేపర్ గ్రూప్-ఏ, ఫస్ట్‌ లాంగ్వేజ్ పేపర్1 (కాంపోజిట్‌ కోర్స్‌), ఫస్ట్‌ లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్‌ కోర్స్‌)
  • ఏప్రిల్ 4 – సెకండ్ లాంగ్వేజ్
  • ఏప్రిల్ 6 – థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
  • ఏప్రిల్ 8 – మ్యాథ్స్ పేపర్
  • ఏప్రిల్ 10 – సైన్స్ పేపర్ (పార్ట్-1 ఫిజికల్ సైన్స్ అండ్ పార్ట్-2 బయాలాజికల్ సైన్స్)
  • ఏప్రిల్ 11 – సోషల్ స్టడీస్
  • ఏప్రిల్ 12 – ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1 (సంస్కృతం మరియు అరబిక్) మరియు ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ)
  • ఏప్రిల్ 13 – ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 2 (సంస్కృతం మరియు అరబిక్).

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 8 =