గ్రూప్- 1 ప్రిలిమ్స్‌లో కటాఫ్ మార్కులపై స్పష్టత ఇచ్చిన టీఎస్పీఎస్సీ

Telangana TSPSC Gives Clarity on Group-1 Prelims-2022 Cut off Marks, Telangana TSPSC Gives Clarity on Group-1 Prelims-2022, TSPSC Group-1 Prelims-2022, Telangana Govt Amendments to Reduce Cut off Marks , Telangana Govt Reduce Cut off Marks , Written Test to the Posts SI Constables, Mango News, Mango News Telugu, Preliminary Written Test, Posts SI Constables, SI And Constables, Sub-Inspector, Telangana Constables, Telangana Sub-Inspector, Telangana Police, Telangana Police Cut off Marks in Preliminary Written Test, Telangana Govt Latest News And Updates

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా అక్టోబర్ 16న టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్-1 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 503 పోస్టులకు 2 లక్షల 86 వేల 51 మంది పరీక్ష రాశారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,019 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పరీక్ష పత్రం చాలా కఠినంగా, సివిల్స్ స్థాయిలో ఉందని వార్తలు వచ్చాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు కూడా ఆందోళన వెలిబుచ్చిన విషయం తెలిసిందే. ఇక గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులపై సోషల్ మీడియాలోనూ వివిధ రకాలుగా ప్రచారం జరుగుతోంది. ఇన్ని మార్కులు వస్తేనే మెయిన్స్‌కు ఎంపిక చేస్తారంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షకు సంబంధించి కటాఫ్ మార్కులపై గందరగోళాన్ని తొలగించడానికి టీఎస్పీఎస్సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్షలో ఎలాంటి కటాఫ్ మార్కులు ఉండవని స్పష్టం చేసింది. అలాగే ఈ పరీక్ష కేవలం అభ్యర్థులను ఫిల్టర్ చేయడానికి మాత్రమే అని, మల్టీజోన్ ప్రకారం రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్ సెలెక్ట్ చేస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఇక ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ను మరో వారంలో ప్రకటిస్తామని కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. కాగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష డిసెంబరులో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 13 =