వరంగల్‌ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూత.. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

Warangal Medical Student Preethi Passed Away Telangana Govt Announces Rs 10 Lakh Ex Gratia, Warangal Medical Student Preethi, Medical Student Preethi Passed Away, Telangana Govt Announces Preethi Ex Gratia, Telangana Govt 10 Lakh Ex Gratia To Preethi, Mango News, Mango News Telugu,Nims Hospital Hyderabad,Nims Hospital Panjagutta Contact Number,Warangal News,Warangal News Live,Warangal News Today English,Warangal News Today Telugu,Warangal Newspaper Today, T Harish Rao Contact Number,T Harish Rao Email Address,T Harish Rao Office Address,T Harish Rao Portfolio,T Harish Rao Twitter,T Harish Rao Wife,Tanneru Harish Rao, Ex Gratia Payment Rules In Telangana,Ex Gratia Government Of India

వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ డి ప్రీతి కన్నుమూసింది. ఐదు రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన ఆమె చివరకు తనువు చాలించింది.ఈ మేరకు నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ప్రీతి మరణంపై ఆదివారం ప్రకటన విడుదల చేసింది. కాగా సీనియర్‌ వేధింపుల కారణంగా డాక్టర్‌ ప్రీతి ఈ నెల 22న ఆత్మహత్యకు యత్నించింది. మెరుగైన వైద్యసేవల కోసం ఆమెను వరంగల్‌ నుంచి నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు చికిత్సను అందించింది.

జనరల్‌ మెడిసిన్‌, నెఫ్రాలజీ, కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, అనస్థీషియా తదితర విభాగాల వైద్యుల బృందం ప్రీతిని నిరంతరం పర్యవేక్షిస్తూ.. ఎక్మో, సీఆర్‌ఆర్‌టీ లాంటి అత్యాధునిక చికిత్సలను అందించారు. కానీ వైద్యుల శ్రమ ఫలించలేదు. మల్టీ ఆర్గాన్స్‌ ఫెయిల్యూర్‌తో ఆదివారం ఉదయం బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు నిర్ధారించిన వైద్యులు ప్రీతి తల్లిదండ్రులకు విషయం తెలియజేశారు. ‘స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందం నిరంతరం ప్రయత్నించినప్పటికీ, ఉపయోగం లేకుండా పోయింది. ఫిబ్రవరి 26, 2023 రాత్రి 9.10 గంటలకు డాక్టర్ ప్రీతి మరణించింది’ అని నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు.

ఇక ప్రీతి మృతి చెందిన నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రీతి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించగా.. వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందడం దురదృష్టకరమని, దోషులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని, ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఇంకా ఇతర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌ తదితరులు ప్రీతి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులు ప్రీతి మృతికి విచారం వ్యక్తం చేశారు. కాగా ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం ఆమె స్వస్థలం వరంగల్ జిల్లా మొండ్రాయిలోని గిర్ని తండాకు తరలించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 11 =