బీఆర్ఎస్ .. కాంగ్రెస్.. మధ్యలో బీజేపీ..

Water War Again In Telangana, Water War In Telangana, Telangana, KRMB, BRS, Congress, BJP, Telangana Water War, Latest Water War News Telangana, Water War News Update Telangana, TS CM Revanth Reddy, Political News, Lok Sabha Elections, Mango News, Mango News Telugu
Telangana,KRMB,Water war again in Telangana,BRS,Congress, BJP, Telangana Water war

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వాటర్ వార్ ఎంటరయిపోయింది . కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకుందని  మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా పొలిటికల్‌ హీట్‌ను పెంచాయి.అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అలాంటి ప్రతిపాదన వచ్చిన మాట నిజమేన్న రేవంత్ సర్కార్.. కానీ తాము కేంద్ర ప్రతిపాదనకు ఒప్పుకోలేదని  వివరణ ఇచ్చింది. ప్రతిపక్ష నేతలు దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.

కేఆర్ఎంబీపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చినా సరే.. ఈ అంశంపై గులాబీ నేతలు  మాత్రం అధికారపార్టీ చెబుతున్న మాటలను నమ్మడం లేదు.  ఉమ్మడి ప్రాజెక్టులను ఇకపై  కేఆర్ఎంబీ నిర్వహిస్తే మాత్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి . కేంద్రం షరతులకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుందని నిరంజన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.

కేఆర్‌ఎంబీ పరిధిలోకి శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులను తీసుకెళ్లడం సరికాదని నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు.  కేంద్ర ప్రభుత్వం షరతులకు రేవంత్ సర్కార్ ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ సర్కార్ మోడీ ప్రభుత్వానికి  తాకట్టు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను నెరవేర్చే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు .

మరోవైపు ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ లీడర్స్‌కు బీజేపీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. గతంలో కృష్ణా నదీ జలాలకు సంబంధించి జరిగిన ఒప్పందంపై అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ సంతకం చేశారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గుర్తు చేశారు.అంతేకాదు అప్పుడు హరీశ్‌రావు ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్నారని ఆయన ఆరోపిస్తున్నారు.

ఉమ్మడి ప్రాజెక్టులు నిజంగానే కేఆర్ఎంబీ పరిధిలోకి వెళుతున్నాయో లేదో  అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాకపోయినా.. రాజకీయ పార్టీలు మాత్రం అప్పుడే  తప్పు మీదంటే మీదే అంటూ ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడంతో తెలంగాణ పొలిటికల్ లో వాటర్ వార్ ప్రారంభమయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − six =