ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ చికిత్సకు ఏటా 100 కోట్ల ఖర్చు, ఏడాదికి 15 వేల మందికి ఉచితంగా వైద్య సేవలు

95 cr worth of works at MNJ Cancer Hospital, Harish Rao, Harish Rao Visits MNJ Govt Cancer Hospital, Hyderabad, Mango News, Mango News Telugu, Minister Harish Rao, Minister Harish Rao Visits MNJ Govt Cancer Hospital at Hyderabad, MNJ Govt Cancer Hospital, Screening programme to identify cancers at early stage, Screening programme to identify cancers at early stage in Telangana, telangana, Telangana govt is spending 100 crores on Cancer prevention, Telangana Health Minister Harish Rao, World Cancer Day

వరల్డ్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం లక్డీకాపూల్ లోని ప్రభుత్వ ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రిలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్, సిటీ స్కాన్, పేషెంట్స్ అటెండెన్స్ కోసం సత్రం భవనాన్ని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రతీ వార్డును పరిశీలిస్తూ, అక్కడ చికిత్స తీసుకుంటున్న వారితో వైద్య సేవలు,సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఉత్తమ వైద్య సేవలు అందిస్తుందని రోగులకు భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, క్యాన్సర్ ని ప్రాథమికదశలో గుర్తించి ఆసుపత్రికి రావాల్సిన బాధ్యత ప్రజలదే అని, రాష్ట్రంలో ఏడాదికి 15000 మంది క్యాన్సర్ రోగులకు ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు ఆందోస్తోందని చెప్పారు.

ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ చికిత్సకు ప్రభుత్వం ఏటా 100 కోట్లు ఖర్చు:

గత 30 ఏళ్ళల్లో 50% క్యాన్సర్ కేసులు పెరిగాయి, ప్రపంచ వ్యాప్తంగా 100 రకాల క్యాన్సర్ల గుర్తింపు జరిగిందన్నారు. ఆహారంలో మార్పుల ద్వారా, బరువుని అదుపులో ఉంచితే కొంత వరకు క్యాన్సర్ ని నియంత్రించవచ్చని, ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హాని చేస్తాయన్నారు. పిహెచ్సి స్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, సిబ్బందికి క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ ఇచ్చి బిపి, షుగర్ వ్యాధుల లాగే క్యాన్సర్ ని కూడా స్క్రీనింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామ స్థాయిలో 40 ఏళ్ళు దాటినా అందరికి క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయాలని ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్రంలో 22% నోటి, 13% బ్రెస్ట్, 12% గర్భాశయ క్యాన్సర్ లు వెలుగు చూస్తున్నాయి. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఎం.ఎన్.జేలో అధునాతన సిటీ స్కాన్ రూ.7.16 కోట్లతో ఏర్పాటు చేశామని తెలిపారు. డెంటల్ ఎక్సరే కోసం ఓపిజి మెషిన్ ను, అలాగే రోటరీ క్లబ్ వారు కోటి రూపాయలతో దానం చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా ఈ రోజు ప్రారంభించామని, సర్వేకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్ లను స్క్రీన్ చేసేందుకు ఈ బస్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఇక నినా రావు చారిటబుల్ ట్రస్ట్ తరపున 3 కోట్లతో పేషెంట్స్ అటెండెన్స్ కోసం 300 పడకలతో ఏర్పాటు చేసిన భవనం నేటి నుంచి అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ చికిత్సకు ప్రభుత్వం ఏటా 100 కోట్లు ఖర్చు చేస్తోందని, నిమ్స్, ఎం.ఎన్.జే ఆస్పత్రుల్లోనూ క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 5 =