కోటి పుణ్యాలకు నెలవైన రోజు ముక్కోటి ఏకాదశి : సీఎం వైఎస్ జగన్

2022 Vaikuntha Ekadashi, 2022 Vaikuntha Ekadashi fasting date, AP CM YS Jagan, AP CM YS Jagan Extends Vaikunta Ekadasi Festival Greetings People, AP CM YS Jagan Extends Vaikunta Ekadasi Festival Greetings People in the State, Kanipakam Varadaraja Swami Temple, Mango News, Significance of Vaikuntha Ekadashi, Vaikunta Ekadashi 2022 Date, Vaikunta Ekadasi Festival Greetings People in the State, Vaikuntha Ekadashi, Vaikuntha Ekadashi 2022, Vaikuntha Ekadashi Festival, Vaikuntha Ekadashi Festival Celebrations, Vaikuntha Ekadashi News, YS Jagan Extends Vaikunta Ekadasi Festival Greetings, YS Jagan Extends Vaikunta Ekadasi Festival Greetings People

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “ముక్కోటి దేవతలూ శ్రీమహావిష్ణువును దర్శించుకునే పవిత్రమైన రోజు, కోటి పుణ్యాలకు నెలవైన రోజు ముక్కోటి ఏకాదశి. ఆ శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు” అని సీఎం వైఎస్ జగన్‌ ట్వీట్‌ చేశారు.

మరోవైపు వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు దేవాలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. మరోవైపు కరోనా మార్గదర్శకాల అనుగుణంగా, వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు పది రోజుల పాటుగా ఉన్న తిరుమలలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 6 =