42,34,322 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్స్, ప్రారంభించిన సీఎం జగన్

andhra pradesh, Andhra Pradesh News, AP Jagananna Vidya Kanuka Scheme, Jagananna Vidya Kanuka Scheme, Jagananna Vidya Kanuka Scheme Beneficiaries, Jagananna Vidya Kanuka Scheme Benefit, Jagananna Vidya Kanuka Scheme Benefiting 42 Lakh Students, Jagananna Vidya Kanuka Scheme In AP, Vidya Kanuka Scheme, ys jagan mohan reddy

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘జగనన్న విద్యా కానుక’ పథకాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో జగనన్న విద్యాకానుక పథకాన్ని సీఎం ప్రారంభించారు. ముందుగా పునాదిపాడు హైస్కూల్‌లో నాడు-నేడు పనులను సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులను పలకరిస్తూ, వారితో ముచ్చటించారు.

రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే 42,34,322 మంది విద్యార్థిని, విద్యార్థులకు విద్యా కానుక కిట్లు అందించనున్నారు. పిల్లలకు బడులు ప్రారంభమయ్యే సమయంలో వారికీ కావాల్సిన వస్తువులు సమకూర్చటానికి పేద కుటుంబాల ఇబ్బందులు తొలగించాలనే లక్ష్యంతో సుమారు రూ.650 కోట్ల వ్యయంతో విద్యాకానుక కిట్ల పంపిణీకి సీఎం వైఎస్ జగన్ రూపకల్పన చేశారు. విద్యాకానుక కిట్లతో పాటుగా కరోనా‌ నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు కూడా పంపిణీ చేశారు.

జగనన్న విద్యా కానుక కిట్లలో ఉన్న వస్తువులు ఇవే:

  • 3 జతల యూనిఫారాలు(క్లాత్)
  • ఒక స్కూల్‌ బ్యాగ్
  • పాఠ్య పుస్తకాలు
  • నోట్ బుక్స్
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • బెల్టు

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =