జగనన్న విద్యా కానుక కిట్ లో ఉండేవి ఇవే, అక్టోబర్ 8న ప్రారంభం

AP CM YS Jagan, AP CM YS Jagan To Start Jagananna Vidya Kanuka Programme, AP Jagananna Vidya Kanuka Program, AP Jagananna Vidya Kanuka Scheme, Jagananna Vidya Kanuka, Jagananna Vidya Kanuka Programme, Jagananna Vidya Kanuka Programme on October 8th, Jagananna Vidya Kanuka Scheme, Vidya Kanuka Programme

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని అక్టోబర్ 8 వ తేదీన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 42.34 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరేలా, సుమారు రూ.650 కోట్ల వ్యయంతో విద్యాకానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు సమాచారశాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు విద్యాకానుక‌ కిట్లు అందించనున్నారు.

జగనన్న విద్యా కానుక కిట్లలో ఉండే వస్తువులు ఇవే:

  • 3 జతల యూనిఫారాలు
  • ఒక స్కూల్‌ బ్యాగ్
  • పాఠ్య పుస్తకాలు
  • నోట్ బుక్స్
  • ఒక జత బూట్లు
  • రెండు జతల సాక్సులు
  • బెల్టు

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =