టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు ఏపీ ప్రభుత్వం అనుమతి.. కీలక ప్రకటన చేసిన చిత్తూరు ఎస్పీ

AP Govt Gives Permission For TDP National General Secretary Nara Lokesh's Yuva Galam Padayatra,Ap Govt Gives Permission,Tdp Youth Leader Nara Lokesh Padayatra,Chittoor Sp Makes Key Announcement,Mango News,Mango News Telugu,Nara Lokesh Age,Nara Lokesh Twitter,Nara Lokesh Son,Nara Lokesh Padayatra,Nara Lokesh Myneta,Nara Lokesh Father,Nara Lokesh Family,Nara Lokesh,Nara Lokesh Latest News,Nara Lokesh Latest News And Updates,Nara Lokesh Latest Updates,Nara Lokesh Padayatra Latest News and Updates

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ ఈనెల 27వ తేదీ నుంచి ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పాదయాత్ర 400 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 4,000 కి.మీ దూరం కొనసాగుతుందని ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. ఒకవైపు దీనికి సంబంధించి టీడీపీ అన్ని ఏర్పాట్లు చేసుకుంటూండగా.. మరోవైపు ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో ఈ యాత్రపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా లోకేష్ పాదయాత్రకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. యాత్ర కుప్పం నుంచి ప్రారంభం కానున్న క్రమంలో చిత్తూరు ఎస్పీ రిషాంత్ సోమవారం కీలక ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ రిషాంత్ దీనిపై మీడియాకు వివరిస్తూ.. నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని స్పష్టం చేసిన ఆయన దీనిపై అనవసరంగా కొంత దుష్ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఏపీలో లోకేష్ పాదయాత్రకు సంబంధించి పర్మిషన్ అడుగుతూ టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీ లేఖ రాశారని, దీనికి డీజీపీ కార్యాలయం నుంచి సమాధానం కూడా వెళ్లిందని తెలియజేశారు. అయితే జిల్లాలో యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో లోకేష్ సహా టీడీపీ నేతలు, శ్రేణులకు కొన్ని కీలక సూచనలు చేశారు. పాదయాత్ర సందర్భంగా వారు నిబంధనలను పాటించాలని, అలాగే యాత్రలో ఎక్కడా ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని, సంయమనంతో వ్యవహరించాలని ఆయన కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 13 =