అందుకే అక్కడే మూడు రోజులు!

Pawan's Master Plan As The Center Of Pithapuram.., Pawan Master Plan, Pithapuram Pawan Master Plan, Master Plan, Center Of Pithapuram, Pithapuram Center Pawan Master Plan, Pawan Election Rally, Election Rally Starts From Pithapuram, March 30 Election Rally, Pawan Kalyan, AP Elections 2024, Lok Sabha Elections, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
pawan election rally starts from pithapuram on march 30 ap elections 2024 telugu news

2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటి చేసిన జనసేన అధినేత రెండు చోట్లా ఓడిపోయారు. నాడు భీమవరం, గాజువాక నుంచి పవన్‌ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ సారి పిఠాపురం నుంచి పోటికి దిగనున్నారు.  పిఠాపురంలో కాపు ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. 2 లక్షల 33 వేల ఓటర్లలో 91 వేల ఓటర్లు కాపులేనని లెక్కలు చెబుతున్నాయి. పవన్‌ కూడా కాపే. ఈ కుల సమీకరణలను పరిగణనలోకి తీసుకోనే ఆయన పిఠాపురం నుంచి పోటి చేయాలని ఫిక్స్‌ అయినట్టుగా తెలుస్తోంది. అయితే పవన్‌ ప్రత్యర్థిగా వైసీపీ నుంచి వంగా గీతా ఉన్నారు. దీంతో పిఠాపురంలో టగ్‌ ఆఫ్‌ వార్‌ ఖాయంగా కనిపిస్తోంది. పవన్‌కు కూడా ఈ విషయం తెలుసు. అందుకే పవన్‌ పిఠాపురంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు.

మూడు రోజులు పిఠాపురంలోనే:

పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఈ నెల 30న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే పవన్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై ప్రచార వివరాలపై చర్చించారు. ఈ పర్యటనలో జనసేన పోటీ చేసే అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాల్సిన అవసరం ఉంది. మూడు విడతల్లో ప్రచారం చేపట్టనున్న ఈ కార్యక్రమం మొదటి విడత పిఠాపురం నుంచి మొదలుకానుంది. ఈ పర్యటనలో భాగంగా పిఠాపురంలోనే ఆయన మూడు రోజులు ఉండనున్నారు:

దేవుని అనుగ్రహం కోసం:

పిఠాపురం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ పురుతికా అమ్మవారిని, శక్తిపీఠాన్ని, దత్త పీఠాన్ని దర్శించుకుంటారు. పార్టీ నేతలతో భేటీ, క్రియాశీలక కార్యకర్తలతో సమావేశాలు, మిత్రపక్షాలైన తెలుగుదేశం, బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. అంతేకాకుండా బంగారు పాప, దర్గా లాంటి ధార్మిక ప్రదేశాలను సందర్శిస్తారని, క్రైస్తవ పెద్దలను కలుస్తారని, మతాంతర ప్రార్థనల్లో పాల్గొంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మూడు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో మకాం వేసి ఉగాది వేడుకలను కూడా అక్కడి ప్రజల మధ్యే జరుపుకోవాలని పవన్ భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా చేయడం తన మద్దతుదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అటు ఓటర్లను కూడా ఆకర్షించవచ్చన్నది పవన్‌ ఆలోచనగా తెలుస్తోంది. మరోవైపు వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీతా ఇప్పటికే ప్రచారం కార్యక్రమంలో తనదైన మార్క్‌ చూపిస్తున్నారు. పవన్‌ ‘కాపు’ స్ట్రాటజీకి చెక్‌ పెట్టేందుకు గీతా ప్రయత్నిస్తున్నారు. తాను కూడా కాపు ఆడపడుచునేనని ప్రచారం చేస్తున్నారు. మరి చూడాలి పిఠాపురం ప్రజలు ఎవరు వైపు నిలబడతారో!

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =