వరంగల్ ‘నిట్’ కళాశాల వసంతోత్సవ ‍వేడుకల్లో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విద్యార్థులనుద్దేశించి కీలక ప్రసంగం

Janasena Chief Pawan Kalyan Attends For The Spring Spree Celebrations in Warangal NIT College,Janasena Chief Pawan Kalyan,Pawan Kalyan Attends For The Spring Spree Celebrations,The Spring Spree Celebrations in Warangal,Pawan Kalyan in Warangal NIT College,Mango News,Mango News Telugu,JanaSena Chief Pawan Kalyan Full Speech,Pawan Kalyan Entry at Spring Spree 2023,PawanKalyan Speech at Warangal NIT,Pawan Kalyan Strong Reply to YCP,Janasena Chief Pawan Kalyan Latest News and Updates,Pawan Kalyan FUNNY Speech at Warangal,NIT Warangal Spring Spree23

వరంగల్ లోని ప్రతిష్టాత్మక ‘నిట్’ కళాశాలలో 3 రోజుల పాటు జరుగనున్న కళాశాల వసంతోత్సవ ‍(స్ప్రింగ్‌ స్ప్రీ) వేడుకలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి స్ప్రింగ్‌ స్ప్రీ వేడుకలను ప్రారంభించారు. అనంతరం నిట్ విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన జీవితంలో జరిగిన కొన్ని ఇంట్రస్టింగ్ సంఘటనలను విద్యార్థులతో షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో అయన మాట్లాడుతూ.. కళ, ఏ రాష్ట్రానికి చెందినవారినైనా కలుపుతుందని, అయితే మానవత్వం, సంస్కృతి ఒక్కటే మనుషులను ఏకం చేస్తుందని పేర్కొన్నారు. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ప్రాంతాలకు అతీతంగా పాదం కదిపారని గుర్తుచేశారు. బాల్యంలో లియోనార్డో డావిన్సీని తన రోల్‌ మోడల్‌గా తీసుకున్నానని గుర్తు చేసుకున్నారు.

కాగా తాను సాధారణంగా విద్యా సంస్థల కార్యక్రమాలకు వెళ్లనని, ఎక్కువ చదువుకోకపోయినా జీవితంలో మాత్రం నిత్య విద్యార్థినేనని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఫెయిల్యూర్స్ విజయానికి సోపానాలుగా మలచుకోవాలని, నేర్చుకోవడం అనే ప్రక్రియను ఎప్పుడూ మానకూడదని స్టూడెంట్స్‌కు సూచించారు. ఇక తాను ఎప్పుడూ పరాజయాల నుంచి పారిపోలేదని, ఈరోజు ఓడిపోయినా.. రేపు గెలుస్తాననే నమ్మకంతో ఉండేవాడినని తెలిపారు. అలాగే ఒకానొక సందర్భంలో.. ఖుషీ సినిమా సమయంలో న్యూజిలాండ్‌ దేశానికి వలస వెళ్లిపోదామనుకున్నానన, దానికి సంబంధించిన ఇమ్మిగ్రేషన్‌ పేపర్స్‌ కూడా రెడీ చేసుకున్నానని తెలిపారు. అయితే ఒక నెల పాటు ఆ పేపర్స్‌ని తనదగ్గర పెట్టుకొని ఆలోచించానని, కష్టమో నష్టమో ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు పవన్‌ కళ్యాణ్.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + four =