బీజేపీతో జత కట్టడం టీడీపీ-జనసేన కూటమికి లాభమా? నష్టమా?

TDP-BJP-Janasena alliance, ap elections, ap
TDP-BJP-Janasena alliance, ap elections, ap

ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నకొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పొత్తులు, ఎత్తులు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే జనసేన- తెలుగు దేశం పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా కూటమి వైపు మొగ్గుచూపింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు కలిసి బరిలోకి దిగుతున్నాయి. ఏపీలో ఈసారి బీజేపీ 10 అసెంబ్లీ.. ఆరు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన 21 అసెంబ్లీ.. రెండు పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగుతోంది. మిగిలిన స్థానాల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేస్తోంది. ఇప్పటికే 128 స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను కూడా ప్రకటించారు.

అయితే బీజేపీ జత కట్టడం ద్వారా తెలుగు దేశం, జనసేన పార్టీలకు లాభమా?.. నష్టమా? అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై ఇండియా ఇంటెన్షన్స్ అనే ఇండిపెండెన్స్ ఏజెన్సీ సర్వే చేసి సంచలన విషయాలు బయటపెట్టింది. బీజేపీ జతకూడడం టీడీపీ-జనసేన గెలుపు అవకాశాలను మెరుగుపరుస్తుందని 47 శాతం మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 44 శాతం మంది బీజేపీతో జతకూడడం వల్ల టీడీపీ-జనసేన గెలుపు అవకాశాలు దిగజారుతాయని అంటున్నారు. మరో 9 శాతం మంది మాత్రం టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ జతకట్టడం వలన ఎటువంటి ప్రభావం చూపదని అభిప్రాయ పడుతున్నారు.

ఇక వైసీపీ ఓటర్లలో 6.5 శాతం మంది టీడీపీ-జనసేన కూటమి వైసీపీని ఢీ కొట్టేందుకు బీజేపీ సహకరిస్తుందని అభిప్రాయపడుతున్నారు. 9 శాతం మంది టీడీపీ ఓటర్లు వైసీపీని ఢీ కొట్టేందుకు జనసేన-టీడీపీ కూటమికి బీజేపీ సహకరించదని అంటున్నారు.  ఇక మిగిలిన ఓటర్లలో 57 శాతం మంది టీడీపీ-జనసేన కూటమికి బీజేపీ సహకరిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 10 =