మరి ఉమారెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి ఏంటి?

Kandru Kamala, Vidadala Rajini, RK is Guntur YCP MP candidate, Umareddy Venkatareddy,Jagan,YS Jagan, Chandrababu, Pawan Kalyan, YCP, TDP,AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Kandru Kamala, Vidadala Rajini, RK is Guntur YCP MP candidate, Umareddy Venkatareddy,Jagan,YS Jagan, Chandrababu, Pawan Kalyan, YCP, TDP,

ఏపీలో అన్ని పార్టీల కంటే వైసీపీ రాజకీయాలు మొదటి నుంచీ కాస్త భిన్నంగానే కనిపిస్తున్నాయి. అందరి కంటే  ముందుగా అభ్యర్ధులను ప్రకటించి..ప్రచారంలో దూసుకుపోదామని అనుకున్న సీఎం జగన్‌కు ఆదిలోనే హంసపాదులా అసంతృప్తులు తాకిడి ఎక్కువ అయింది.  అప్పటినుంచీ వాళ్ల బుజ్జగింపులతోనే చాలా సమయం వృధా అయింది. చాలామంది నేతలు  ఇతర  పార్టీలకు జంప్ అవగా.. మరికొంతమంది నేతలు సొంతపార్టీలోనే ఉంటూ అసంతృప్త  రాగం పాడుతున్నారు.

అలా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తనకు మంగళగిరి టిక్కెట్ ను కేటాయించకుండా, గంజి చిరంజీవిని ఇంచార్జిగా నియమించడంపై, అలిగి వైసీపీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.  ఆ తర్వాత వైఎస్ షర్మిల వెంట నడుస్తానంటూ ప్రకటించి కాంగ్రెస్ లో చేరిన ఆర్కే. . కొద్ది రోజులకే మారిన రాజకీయ పరిణామాలతో మళ్లీ వైసీపీలోకి వెళ్లిపోయారు.

అయితే మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా పేరుపొందిన ఆళ్ల కుటుంబానికి  చెందిన ఆర్కే.. వైసీపీని వీడటంతో ఆ ప్రభావం రాబోయే ఎన్నికలలో ఉంటుందని గుర్తించిన జగన్.. ఆయనను బుజ్జగించి మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే , ఇచ్చిన మాట ప్రకారం.. ఆర్కేను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడానికి జగన్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జగన్ నిర్ణయంతో గుంటూరు రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమైన ఉమా రెడ్డి వెంకటరమణ ..తాజాగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో అసంతృప్తికి లోనై వెంటనే హైదరాబాద్ కు వెళ్లిపోయినట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే  అక్కడ పొలిటికల్ వాతావరణం హీటెక్కడం గ్యారంటీ అని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

మరోవైపు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కొత్తవారిని దించడానికి జగన్ కసరత్తు చేస్తున్నారు. గుంటూరు తూర్పు అభ్యర్థిగా ఎమ్మెల్యే ముస్తఫా కుమర్తెకు సీఎం జగన్.. ఈ సారి ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అలాగే తాడికొండకు సుచరితను ఖరారు చేశారు. మంగళగిరి నుంచి గంజి చిరంజీవిని ఇన్చార్జిగా ప్రకటించినా కూడా, కాండ్రు కమల కూడా ఈ  రేసులోనే ఉన్నారు. అలాగే పత్తిపాడుకు కొత్త అభ్యర్థిని నియమించిన  జగన్.. తెనాలి, పొన్నూరులలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడానికి ఆలోచిస్తున్నారు. గుంటూరు పశ్చిమ నుంచి చిలకలూరిపేట ఎమ్మెల్యే, మంత్రి విడదల రజిని ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తూ ముందంజలో ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 16 =