దేవినేని ఉమ‌కు చుక్కెదురు..!

Assembly election, Chief Minister Jagan, Chandrababu, Minister Devineni, Uma,Minister for Irrigation Devineni Umamaheswara Rao, Minister for Irrigation,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,andhra pradesh,Mango News Telugu, Mango News
Assembly election ,Chief Minister jagan , Chandrababu , Minister Devineni ,

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా పావులు క‌దుపుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు అందుకోసం ఎటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌డానికైనా వెనుకాడ‌డం లేద‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ మ‌రోసారి ముఖ్య‌మంత్రి అయితే పార్టీప‌రంగాను, వ్య‌క్తిగ‌తంగాను ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే ఆలోచ‌న‌లో ఉన్న చంద్ర‌బాబు ఆయ‌న‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు ఎన్నో వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఆ దిశ‌గా ఇప్ప‌టికే కొంత స‌క్సెస్ అయ్యారు. తొల‌త జన‌సేన‌తోను, తాజాగా బీజేపీతోను పొత్తుపెట్టుకుని ఎన్నిక‌ల సంగ్రామంలో జ‌గ‌న్‌పై పోరుకు సై అంటున్నారు. ఈనేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా నిల‌ప‌బోయే అభ్య‌ర్థుల విష‌యంలో కూడా చంద్ర‌బాబు చాలాసార్లు వ‌డ‌పోత‌లు చేస్తున్నారు. ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే కొన్నిచోట్ల సీనియ‌ర్ల‌ను కూడా ప‌క్క‌న‌పెట్టాల‌ని భావిస్తున్నారు.

ఆ జాబితాలో మాజీ మంత్రి దేవినేని ఉమ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఉమ ఎవ‌రిపై అయితే ఓడిపోయారో వారికే ఈసారి టీడీపీ టికెట్ కేటాయిస్తోంది. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా ప‌నిచేసిన ఉమ‌ను కాద‌ని ఈసారి వేరే వ్య‌క్తికి ఆసీటు ఖ‌రారైంది. 1999 లో కాచిగూడ లో జరిగిన రైలు ప్రమాదంలో సోదరుడు వెంకట రమణ ఆకస్మిక మరణం తో రాజకీయ వారసుడిగా క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించి నందిగామ నియోజకవర్గ ఉపఎన్నికల్లో విజయం సాధించి తొలి సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు దేవినేని ఉమ. 2009 లోను, 2014లోను ఉమ  మైలవరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నిక‌య్యారు. కృష్ణా జిల్లాలో కష్ట కాలంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించి జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహించే మెట్ట ప్రాంతంలోనే కాకుండా జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. నవ్యాంధ్రప్రదేశ్లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావ‌డంతో జలవనరుల శాఖ మంత్రిగా కూడా ఉమ ప‌నిచేశారు. పట్టిసీమ , పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకాలను అతితక్కువ కాలంలో పూర్తి చేసి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయిన‌ప్ప‌టికీ గ‌త ఎన్నిక‌ల్లో వేగంగా వీసిన ఫ్యాను గాలికి నాడు వైసీపీ నుంచి పోటీచేసిన వ‌సంత కృష్ణప్రసాద్ చేతిలో ఓట‌మి చెందారు. ఆ కృష్ణప్రసాద్ కొద్ది రోజుల కిందట వైసీపీకి రాజీనామా చేసి మాజీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరి, మ‌రోసారి దేవినేని ఉమ‌కు ఎస‌రు పెట్టారు. వసంత‌నే టీడీపీ అభ్య‌ర్థిగా మైల‌వ‌రం నుంచి నిట‌బెట్టేందుకు టీడీపీ సిద్ధ‌మ‌వుతోంది. ఈమేర‌కు ప్రస్తుతం అక్కడ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఇక్కడ కేంద్ర కార్యాలయంలో చర్చించారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని ఆయనకు తెలియజేశారు. ‘సర్వేల ఆధారంగా ఈ నిర్ణయం జరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న ఈ నిర్ణయానికి సహకరించాలని పార్టీ అధినేత తరఫున కోరుతున్నాం’ అని చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని దేవినేని ఆయనతో అన్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ  పెనమలూరు నుంచి పోటీ చేయాల‌ని సూచిస్తున్నా ఆలోచించి నిర్ణ‌యం చెబుతాన‌ని ఉమ చెప్పిన‌ట్లుగా పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 8 =