జగన్‌కు షాక్.. వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా

A Shock to Jagan Ambati Rayudus Resignation from YCP, Ambati Rayudus Resignation YCP, YCP Ambati Rayudus Resignation, Ambati Rayudu, YCP, CM Jagan, Guntur MP Ticket, AP Politics, Latest Ambati Rayudu Resignation, Ambati Rayudu Resignation News Update, Ambati Rayudu Political News, YCP News, CM Jagan, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Ambati Rayudu, YCP, CM Jagan, Guntur MP Ticket, AP Politics

అసెంబ్లీ ఎన్నికల ముంగిట వైసీపీ హైకమాండ్‌కు ఊహించని షాక్ తగిలింది. క్రికెటర్, కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ తీర్థం పుచ్చుకొని కనీసం వారం రోజులు కూడా కాకముందే.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఓవైపు కాపు సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. అదే వర్గానికి చెందిన అంబటి రాయుడు రాజీనామా చేయడం ఏపీ రాజకీయాలను హీటెక్కించింది.

సోషల్ మీడియా వేదికగా అంబటి రాయుడు వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ‘‘ వైసీపీ నుంచి వైదొలుగుతున్నాను. కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. త్వరలోనే తరువాతి కార్యాచరణ ప్రకటిస్తాను’’ అని అంబటి రాయుడు తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అంబటి రాయుడు తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాలను ఊపేస్తోంది.

కొన్నేళ్లుగా అంబటి రాయుడు వైసీపీ పార్టీకి, సీఎం జగన్‌కు దగ్గరగా ఉంటున్నారు. పార్టీలో చేరకముందు నుంచే పలుమార్లు వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో అంబటి పలు పోస్టులు పెట్టారు. ఇక అంబటి రాయుడు వైసీపీలో చేరడం ఖాయమని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగా గతవారం అంబటి రాయుడు అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంబటి పార్టీలో చేరడం ద్వారా కాపు సామాజికవర్గం తమవైపే ఉంటుందని జగన్ భావించారు.

ఇక అంబటికి గుంటూరు ఎంపీ టికెట్ లేదా పొన్నూరు అసెంబ్లీ టికెట్ ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అటు అంబటి కూడా తనకు ఎంపీ సీటు కన్ఫాన్ అని ఫిక్స్ అయిపోయారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటనలు కూడా చేశారు. తెనాలి, మేడికొండూరు, ఫిరంగిపురంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇటీవల అంబటి పర్యటించారు. రైతు భరోసా కేంద్రాలను పరిశీలించి.. వాటి పనితీరును అభినందించారు. అలాగే ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం భోజనం కూడా చేశారు.

ఈ సమయంలోనే మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. అంబటికి కాకుండా.. గుంటూరు ఎంపీ టికెట్ నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలుకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దాదాపు వైసీపీ హైకమాండ్ కూడా శ్రీకృష్ణదేవరాయలు వైపే మొగ్గుచూపుతోందని తెలుస్తోంది. అటు పొన్నూరు అసెంబ్లీ టికెట్ కూడా కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోశయ్యకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో అటు ఎంపీ టికెట్, ఇటు అసెంబ్లీ టికెట్ ఏదీ కూడా అంబటికి దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో అసంతృప్తికి గురైన అంబటి రాయుడు.. వైసీపీక రాజీనామా చేశారట. ప్రస్తుతం అంబటి తర్వాతి కార్యాచరణ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 11 =