ముగిసిన కె. విశ్వనాథ్ అంత్యక్రియలు.. కళాతపస్వికి అశ్రునయనాలతో అభిమానుల తుదివీడ్కోలు

Legendary Telugu Director K Viswanath Last Rites Completed Today at Panjagutta Burial Ground,K Viswanath Last Rites Completed,Demise of Legendary Director K Vishwanath,Mango News,Mango News Telugu,K Viswanath Last Movie,K Viswanath Age,K Viswanath Songs,K Viswanath Super Hit Movies,K Viswanath Best Movies,K Viswanath Movies Hits And Flops List,K Viswanath Family Photos,K Viswanath Kamal Hassan Movies,K Viswanath Chiranjeevi Movies,K Viswanath Young Photos,Director K Viswanath,Kamal Haasan And K Viswanath Movies,Kashi Vishwanath,Kavita Viswanath,Kashi Vishwanath Temple,Kasi Viswanath Director,Kavita Viswanath And Gavaskar,Kashi Vishwanath Images Hd,Kasinathuni Viswanath

సినీ దిగ్గజం, ప్రముఖ దర్శడు కాశీనాధుని విశ్వనాథ్‌ అంత్యక్రియలు పంజాగుట్టలోని శ్మశాన వాటికలో ముగిశాయి. బ్రహ్మాణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించిన కుటుంబ సభ్యులు ఆయన పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందు అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఫిల్మ్‌నగర్‌ నుంచి పంజాగుట్ట వర​కు విశ్వనాథ్‌ అంతిమ యాత్ర సాగగా.. దీనిలో పలువురు సినీ పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు. విశ్వనాథ్‌ను కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీనికిముందు ఫిలిం చాంబర్‌లో విశ్వనాథ్ పార్థీవ దేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.

కాగా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథ్.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెదపులివర్రు గ్రామంలో ఆయన కాశీనాధుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు జన్మించారు. కాగా కె.విశ్వనాథ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇక విశ్వనాథ్‌ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సహా ప‌ద్మ‌శ్రీ వంటి విశిష్ట అవార్డులను అందుకున్న ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రధాని మోదీ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here