చంద్రబాబు పొత్తుల వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ.. ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరిన మంత్రి అంబటి

Minister Ambati Rambabu Challenges Chandrababu To Contest Alone without Alliances in Coming Elections, Minister Ambati Rambabu Challenges Chandrababu, Contest Alone without Alliances in Coming Elections, Alliances in Coming Elections, Chandrababu Naidu is a failed opposition leader, Chandrababu Naidu is a failed opposition leader Says Minister Ambati Rambabu, AP Minister Ambati Rambabu Open Challenge To opposition leader Chandrababu Naidu, opposition leader Chandrababu Naidu, AP Minister Ambati Rambabu Challenge to opposition leader NCBN, AP Minister Ambati Rambabu Aggressive Comments On opposition leader NCBN, AP Minister Ambati Rambabu Comments On opposition leader Chandrababu Naidu, AP Minister Ambati Rambabu Intresting Comments On opposition leader Chandrababu, AP Minister Ambati Rambabu Sensational Comments On opposition leader Nara Chandrababu Naidu, Nara Chandrababu Naidu, Chandrababu Naidu, NCBN, AP Minister Ambati Rambabu, Minister Ambati Rambabu, Ambati Rambabu, Ambati Rambabu Minister for Irrigation, AP Irrigation Minister Ambati Rambabu, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో పొత్తుల వ్యవహారం కీలకం కానుందా? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఈ అనుమానం రాక మానదు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే అప్పుడే పొత్తుల అంశంపై రోజుకో విధంగా వార్తలు వస్తున్నాయి. నిన్న ఇదే అంశంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నవరంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుకి ఇతర పార్టీలు కలిసి రావాలని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రాలో చర్చనీయాంశం అవుతున్నాయి. మరోసారి టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ చంద్రబాబు పొత్తుల వ్యాఖ్యలపై స్పందించింది.

ఈ మేరకు వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జల వనరుల శాఖ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా అసెంబ్లీలో తన కర్తవ్యాన్ని వదిలేసి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బూటకపు నిరసనలు చేస్తున్నారని మండిపడ్డారు. గత టీడీపీ హయాంలో ఉన్న వాటి కంటే ప్రస్తుతం నిత్యావసర ధరలు తక్కువగా ఉన్నాయని మంత్రి తెలిపారు. సీఎం జగన్ తన హామీ మేరకు నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో ప్రజల హృదయాలను గెలుచుకున్నారని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 81% ఫలితాలు సాధించిందని గుర్తు చేశారు. మరోవైపు పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. వైసీపీకి ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ఒంటరిగానే పోటీ చేసి గెలుస్తుందని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =