విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తి ఘటనపై.. మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు

Minister Botsa Satyanarayana Key Comments Over Kodi Kathi Incident at Visakhapatnam Airport,Minister Botsa Satyanarayana Key Comments,Botsa Key Comments Over Kodi Kathi Incident,Kodi Kathi Incident at Visakhapatnam Airport,Mango News,Mango News Telugu,Jagan Gives Kodi Kathi Case Hearing a Miss,NIA Rules Out Conspiracy in 2018 Attack,New Twist In Kodi Kathi Case,Minister Botsa Satyanarayana Latest News,Minister Botsa Satyanarayana Latest Updates,Kodi Kathi Incident Latest Updates

ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం కోడికత్తి ఘటన చుట్టూ తిరుగుతోంది. విశాఖ ఎయిర్ పోర్టులో ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి యదార్ధమని రాష్ట్ర విద్యా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. కోడికత్తి కేసులో ఎన్‌ఐఏ రిపోర్టును కొన్ని మీడియా సంస్థలు వక్రీకరిస్తున్నాయని, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) రిపోర్ట్‌లో ఏముందో వారికి ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో జగనే కావాలని కత్తితో దాడి చేయించుకున్నారనే భావన ప్రజలలో కల్పిస్తున్నారని మండిపడిన ఆయన.. గతంలో తిరుపతిలోని అలిపిరి వద్ద నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నక్షల్స్ దాడి చేశారని, అది కూడా రాజకీయ లబ్దికోసం చంద్రబాబే చేయించుకున్నారా? అని నిలదీశారు. ఇక జగన్‌ మోహన్ రెడ్డిపై ఎయిర్ పోర్ట్‌లో జరిగిన దాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అని, అసలు కోడికత్తి దాడికి పాల్పడిన శ్రీనివాస్ ఏ ఉద్దేశ్యంతో చేశాడో తెలియాల్సి ఉందని మంత్రి బొత్స చెప్పారు.

కాగా గత ఎన్నికలకు ముందు విశాఖ పర్యటన సందర్భంగా అప్పటి ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై ఎయిర్ పోర్టులో శ్రీనివాస్ అనే ఒక యువకుడు కోడికత్తితో దాడి చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఘటన జరిగిన విమానాశ్రయం కేంద్రం ఆధీనంలోని ప్రాంతం కావడంతో దీనిలో ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. తాజాగా ఈ కేసుకి సంబంధించి కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. ఎన్‌ఐఏ కోర్టుకు సమర్పించిన రిపోర్ట్‌లో కొన్ని అంశాలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − five =