ఇకపై శ్రీవారి నైవేద్యం, అన్నప్రసాదం సహా లడ్డూ తయారీలో సేంద్రీయ ఉత్పత్తుల వినియోగం – టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

TTD Chairman YV Subba Reddy Held Governing Council Meeting at Tirumala Takes Several Key Decisions,TTD Chairman YV Subba Reddy,YV Subba Reddy Held Governing Council Meeting,Governing Council Meeting at Tirumala,YV Subba Reddy Takes Several Key Decisions,Mango News,Mango News Telugu,TTD Chairman YV Subba Reddy Latest News,TTD Chairman YV Subba Reddy Latest Updates,TTD Chairman YV Subba Reddy Live News,Governing Council Meeting News Today,Tirumala Latest News and Updates,YV Subba Reddy Council Meeting Latest News

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి స్వామివారి సేవలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం తిరుమలలో పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యులు చేసిన కొన్ని సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించిన ఆయన మరికొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలను సమావేశంలో వివరించారు. వీటికి బోర్డు ఆమోదముద్ర వేసింది. అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు సమావేశ వివరాలను వెల్లడించారు. అలాగే భవిష్యత్తులో టీటీడీ చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల గురించి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక విషయాలు తెలియజేశారు.

టీటీడీ పాలక మండలి భేటీలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఇవే..

  • ఇకపై శ్రీవారి నైవేద్యానికి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించాలని నిర్ణయం.
  • అలాగే అన్నప్రసాదం మరియు లడ్డూ ప్రసాదం తయారీలో కూడా ఇవే ఉపయోగించాలని నిర్ణయం.
  • దీనికోసం సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు.
  • ఇక దాతలు అందించిన రూ.10 లక్షల వ్యయంతో బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి వెండి కవచాలు ఏర్పాటు.
  • పద్మావతి మేడికల్ కాలేజిలో టీబీ విభాగం ఏర్పాటుకు 53.62 కోట్లు కేటాయింపు.
  • అలిపిరి వద్ద గోడౌన్ల నిర్మాణానికి రూ.18 కోట్లు, కోల్డ్ స్టోరేజి నిర్మాణంకు 14 కోట్లు కేటాయింపు.
  • ఇంకా ఢీల్లీలోని ఆడిటోరియం అభివృద్ది పనులకు రూ.4 కోట్లు కేటాయింపు.
  • తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ది పనులకు రూ.3.12 కోట్లు కేటాయింపు.
  • టీటీడీ విద్యా సంస్థలలో భోదన సిబ్బంది నియామకానికి అంగీకారం.
  • ఢీల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 3 నుంచి 13వ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహణ.
  • జూన్ 15 కల్లా శ్రీనివాస సేతు పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు.
  • ఫారిన్ కరేన్సి మార్పిడిపై కేంద్రం విధించిన 3 కోట్ల జరుమానను రద్దు చేయాలని హోంశాఖ దృష్టికి తీసుకువెళ్ళాలని నిర్ణయం.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 10 =