ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

Minister Perni Nani Press Meet, AP Cabinet Meeting Decisions,Mango News,Breaking News Today,Latest Political News 2019,AP Political Updates,AP Cabinet Key Decisions,AP Cabinet Meeting Highlights,Perni Nani Press Meet About AP Cabinet Decisions

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:

  • వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో కొత్త పథకం, కాపు సామాజికవర్గం మహిళలకు ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయం. 45 సంవత్సరాలు నిండిన ప్రతి కాపు మహిళకు ఈ ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ.75వేల సాయం అందజేత
  • వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకానికి రూ.1101 కోట్లు కేటాయింపు, రాష్ట్రంలో జరుగుతున్న నవశకం సర్వే ద్వారా వైఎస్ఆర్ కాపునేస్తం పథకానికి లబ్ధిదారుల ఎంపిక
  • వైఎస్‌ఆర్‌ నవశకం సర్వే ద్వారా పలు ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక
  • కొత్త రేషన్ కార్డులు జారీకి మంత్రి వర్గం ఆమోదం
  • జగనన్న వసతి దీవెన పథకానికి రూ.2300 కోట్లు కేటాయింపు
  • జగనన్న విద్యా దీవెన పథకానికి రూ.3400 కోట్లు కేటాయింపు, ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఆపై చదువులు చదివే విద్యార్థులకు రూ.20వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం
  • ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాట్లపై నిర్ణయం
  • ఒప్పంద ఉద్యోగుల అంశంపై కమిటీ ఏర్పాటు
  • మద్యం ధరల పెంపుపై కేబినెట్ ఆమోద ముద్ర
  • టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య 19 నుంచి 29 కి పెంపుపై ఉత్తర్వులు
  • కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, స్టీల్ ప్లాంట్ కోసం 3,295 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయం. ముడిసరుకు కోసం ఎన్ఎండీసీతో ఒప్పందం, డిసెంబర్ 26న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
  • ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పోరేషన్ ఏర్పాటుకు ఆమోదం
  • ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలకు వేర్వేరు కార్డుల జారీకి ఆమోదం తెలిపిన మంత్రివర్గం.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 3 =