జగన్ ట్రాప్‌లో చంద్రబాబు పడిపోయారా?

Political calculation, Chandrababu, Jagan's trap?congress, TDP, YCP, Janasena, Cpi, Cpm, BJP, Andhra Pradesh News Updates, AP Political News, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News Political calculation, Chandrababu, Jagan's trap?congress, TDP, YCP, Janasena, Cpi, Cpm, BJP, Andhra Pradesh News Updates, AP Political News, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
political calculation, Chandrababu, Jagan's trap?congress, TDP, YCP, Janasena, Cpi, Cpm, BJP

ఏపీలో ఎన్నికల రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే ఆరు జాబితాలలో అభ్యర్దులను ప్రకటించిన సీఎం జగన్.. ఏడో జాబితా విడుదలకు సిద్ధం అవుతున్నారు.  కొద్దిరోజుల క్రితం టీడీపీ, జనసేన రెండు పార్టీలు జగన్ ఓడించడమే లక్ష్యంగా ఒక్కటవగా..తాజాగా బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి నడుస్తుందన్న వార్తలతో  జగన్ అలర్ట్ అయ్యారు. ఢిల్లీ కేంద్రంగా రాజకీయం మొదలు పెట్టిన జగన్ ..తర్వాత పరిణామాలను తమకు అనుగుణంగా మార్చుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఢిల్లీ కేంద్రంగా ఏపీలో పొత్తుల చర్చలతో.. 2014 ఎన్నికల సమయంలో జరిగిన పొలిటికల్ పొత్తులు రిపీట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అయితే దీని వెనుక జగన్ భారీ స్కెచ్ ఉందన్న వార్త వినిపిస్తోంది. ఇటీవల  ఢిల్లీలో అమిత్ షాతో పొత్తుల పైన చర్చించిన చంద్రబాబు.. ఎన్డీఏలో చేరడానికి కూడా అంగీకారం తెలిపారు. అంతే చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన మర్నాడు సీఎం జగన్ కు ఢిల్లీ నుంచి పిలుపురావడం..ప్రధాని మోడీతో జగన్ సదీర్ఘంగా భేటీ అవడం జరిగాయి. అయితే  ఇటు చంద్రబాబును పొత్తుకు కోసం పిలిపించి..అటు జగన్‌తో మంతనాలు జరపడంతో టీడీపీ క్యాంపులో ఆయోమయం నెలకొంది. నిజానికి బీజేపీతో పొత్తు చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా.. జగన్ ఓడించే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదన్న నిర్ణయంతోనే బీజేపీతో కలిసి నడవడానికి ఒప్పుకున్నారు.

అయితే  చంద్రబాబు ఆలోచనను గుర్తించిన బీజేపీ పొత్తుల కోసం ఢిల్లీకి పిలవగా..ఇటు  జగన్ కూడా అంతే  వేగంగా కదిలారు. ఇటు టీడీపీతో పొత్తు..అటు జగన్ తో ‌‌ స్నేహంగా ఉండటంతో.. బీజేపీ తీరుతో తెలుగు తమ్ముళ్లలో ఆందోళన నెలకొంది. పోనీ బీజేపీని దూరం పెడదామా అంటే  రాబోయే ఎన్నికలకు బీజేపీతో పొత్తు కీలకం అన్న విషయంపై ఇప్పటికే అర్ధం అయింది. దీంతోనే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల లెక్కలు ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. దీనిని అవకాశంగా తీసుకున్న బీజేపీ సీట్ల ఖరారులో పట్టు బిగిస్తోంది. కచ్చితంగా జనసేన, బీజేపీకి  50 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి కోరిన విధంగా సీట్లు ఇస్తే అసంతృప్తులు పెరిగే అవకాశం ఉంది..పోనీ ఇవ్వకుండా ఉందామంటే బీజేపీ పొత్తు పెట్టుకోదు. దీనికి తగినట్లే బీజేపీ అధిష్టానం టీడీపీతో  పొత్తు ప్రకటన పైన చేస్తున్న ఆలస్యంపై  అనుమానాలు పెరుగుతున్నాయి.

బీజేపీ నాన్చుడు ధోరణితో సీట్ల వ్యవహారంతోనే టీడీపీ సమయం గడిచిపోతోంది. అటు వైసీపీ అభ్యర్దులు కొంతమంది ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.కానీ ఇక్కడ మూడు పార్టీలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది. అదే ఇప్పుడు అసలు సమస్యగా తయారయింది. జగన్ పథకాలు ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఈ సారి కూడా వైసీపీ సంక్షేమమే ప్రధాన ఎన్నికల అజెండాగా మార్చుకోబోతుంది. ఇప్పుడు టీడీపీ ప్రకటించిన సంక్షేమానికి ప్రచారం అవసరం. కానీ సీట్ల సర్ధుబాటుతోనే టైమ్ వేస్ట్ అవుతుంది తప్ప.. ప్రచారం చేయడానికి సమయం తక్కువగానే ఉంది.

మరోవైపు బీజేపీతో పొత్తు వల్ల బీజేపీని  వ్యతిరేకించే కొన్ని వర్గాలు.. జగన్ కు దగ్గరయ్యే అవకాశాలున్నాయి. ఇటు జగన్ ఎన్నికల వరాలు ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు. బీజేపీతో పొత్తుపై ఫుల్ క్లారిటీ రాకపోవడంతో ఇంకా చంద్రబాబు, పవన్ డైలమాలో ఉన్నారు. వీరిద్దరి నిర్ణయాల కోసం  రెండు పార్టీల కేడర్ వేచి చూస్తోంది. రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన కూటమిని మరింత ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాలతోనే జగన్ ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా కేంద్రంతో జతకట్టి ఏపీలో చంద్రబాబుకు ఉచ్చు బిగిస్తున్నారన్న వార్తలు వినిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 5 =