పీవీ సింధును సత్కరించిన సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.30 లక్షల నగదు బహుమతి

Andhra Pradesh Government, Andhra Pradesh Govt, Bronze Medal at the Tokyo Olympics, Mango News, Olympic Bronze Medalist PV Sindhu, Olympic Bronze Medalist PV Sindhu Meets AP CM YS Jagan, Olympic Bronze Medalist PV Sindhu Meets AP CM YS Jagan Today, Olympic medalist PV Sindhu meets AP CM, Olympics medals, prize money To PV Sindhu, PV Sindhu, PV Sindhu Meets AP CM YS Jagan, PV Sindhu to start academy in Visakhapatnam, PV Sindhu Won Bronze Meda, Tokyo Olympics Bronze Medalist PV Sindhu

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం కైవసం చేసుకున్న బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సింధును సీఎం వైఎస్ జగన్‌ అభినందించి సత్కరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదు బహుమతిని అధికారులు అందజేశారు. విశాఖపట్నంలో వెంటనే అకాడమీని ప్రారంభించాలని, రాష్ట్రం నుంచి మరింత మంది సింధులను తయారు కావాలని సీఎం వైఎస్ జగన్‌ ఆకాంక్షించారు.

అనంతరం సచివాలయ ఆవరణలో పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్‌ జగన్‌ ను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సీఎం జగన్‌ ఆశీర్వదించారని, ఒలింపిక్స్‌లో మెడల్‌ తీసుకురావాలని కోరారని తెలిపారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌కు 2 శాతం రిజర్వేషన్‌ గొప్ప విషయం అని చెప్పారు. అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించిందని, త్వరలోనే అకాడమీ ప్రారంభిస్తానని పీవీ సింధు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + ten =