పిఠాపురంవాసుల మనసును గెలుచుకున్న పవన్

Pawan Kalyan Has Won The Hearts Of Pithapuram Residents,Election tension,YCP Leaders,Pawan Kalyan,Pithapuram,YCP,Janasena,TDP,BJP,Chandrababu,Telugu News,AP State Assembly Elections,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,Pawan Kalyan Pithapuram Election Campaign,Pithapuram Elections,Pithapuram Politics,Pithapuram News,Pawan Kalyan Latest News,Janasena Pawan Kalyan,Janasena News,Pithapuram Residents,Pithapuram Polls,Pawan Kalyan Pithapuram House

ప్రజ‌ల‌కు అందుబాటులో ఉండే నాయ‌కుల‌నే ఎన్నిక‌ల్లో గెలిపించాల‌ని పిఠాపురం ప‌ర్యట‌ిస్తున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఓట‌ర్లకు పిలుపునిస్తున్నారు. అయితే ఇక్కడే మిథున్ రెడ్డి ఇక్కడే  ఓ విషయం మరిచిపోయారని జనసైనికులు కామెంట్లు చేస్తున్నారు.  నిరంత‌రం ప్రజ‌ల‌కు అందుబాటులో ఉంటూ.. ఎవ‌రికి ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా వెంట‌నే స్పందించే వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే విష‌యం రాష్ట్రంలో ప్రజ‌లంద‌రికీ తెలుసని చెబుతున్నారు.బహుశా సీఎం జగన్ ఇచ్చిన ప్రెజర్ కు అలా మాట్లాడుతున్నారేమో అంటూ  పిఠాపురం వాసులు సెటైర్లు వేస్తున్నారు.

ప్రజ‌లు క‌ష్టాల్లో ఉన్నారంటే అక్క‌డ వాలిపోయే మ‌నిషి జ‌న‌సేనాని. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న కౌలు రైతుల‌కు వైసీపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోతే.. సొంత డ‌బ్బుల‌తో రైతుల కుటుంబాల‌ను ఆదుకున్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. కానీ వైసీపీ అధినేత ఇచ్చిన ప్రెజర్ కు కాస్త కన్ఫ్యూజ్ అయ్యారో  ఏంటో కానీ ప్రజలకు  అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలని ప్రచారం చేస్తున్నారు.  అంటే  మిథున్ రెడ్డే..స్వయంగా  ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను గెలిపించాల‌ని చెబుతున్నట్లే అయిందన్న విషయం  ఆ పెద్దాయనకు ఇంకా బుర్రకు ఎక్కలేదా అని పిఠాపురం వాసులు కౌంటర్లు ఇస్తున్నారు.

ఒకవిధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నానని ప్రకటించిన దగ్గర నుంచీ వైసీపీ నేతలకు కంటిమీద కునుకు దూరం అయినట్లే కనిపిస్తోంది. పిఠాపురం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌ట‌న్న మిథున్‌రెడ్డి .. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం రాజంపేట లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలేసి ఆయ‌న పిఠాపురంలో ప‌ర్య‌టించ‌డం చూస్తేనే వైసీపీ ఎంత భ‌య‌ప‌డుతుందో అర్థ‌మ‌వుతుందన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే ఒక్క పిఠాపురంలోనే ప‌దుల సంఖ్య‌లో నాయ‌కులు ఎందుకు మోహ‌రించిన‌ట్లని జనసేన ప్రశ్నిస్తోంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ‌బ్బులు పంచి గెల‌వాల‌ని  చూస్తున్నారని మిథున్ రెడ్డి చెబుతున్నారు. కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు విశ్లేషకులు సైతం చెబుతున్నారు.  ఓటు వేయమని  డబ్బులు పంచుతుంది వైసీపీ నేతలేనని.. రూపాయి తీసుకోకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను గెలిపించుకుంటామ‌ని ఇక్క‌డ ప్ర‌జ‌లు చెబుతున్నారని ఆధారాలతో సహా వివరిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌జ‌ల‌నే న‌మ్ముకున్నారని.. ఆ ప్ర‌జ‌లే ఆయ‌నను గెలిపిస్తారన్న నమ్మకంతో జనసేన పార్టీ ఉంది . నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌ర‌ని మీరంటున్నారు. నియోజవ‌ర్గంలోనే ఉంటాన‌ని ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఇళ్లు తీసుకున్నారని..ఈ ఐదేళ్ల‌లో మీ ఎమ్మెల్యేలు ఎంత‌మంది ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నారో చెప్పండంటూ సవాల్ విసురుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 12 =