మద్యం కేసులో చంద్రబాబుకు రిలీఫ్

Relief to Chandrababu in liquor case,Relief to Chandrababu,Chandrababu in liquor case,Mango News,Mango News Telugu,AP CID Registered another Case,Chandrababu Liquor Scam,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Chandrababu in liquor case Latest News,Chandrababu in liquor case Latest Updates,Chandrababu in liquor case Live News
chandrababu naidu, skill development scam case, ap cid, ap high court, ap politics

తెలుగు దేశం పార్టీకి మంచి రోజులు వచ్చాయి. తెలుగు తమ్ముళ్లు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. రెండు కేసుల్లో బాబుకు అనుకూలంగా తీర్పు వెలువడింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే మధ్యం కేసులో కూడా చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించింది. చంద్రబాబు బెయిల్ పూర్తయ్యే వరకు అరెస్ట్ చేయబోమని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు.

ఇటీవల మద్యం కేసులో కూడా చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాబును ఏ3గా చేర్చారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరుపున లాయర్లు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఈరోజు మధ్యాహ్నం కోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబును ఇరికించారని ఆయన తరుపున లాయర్ వాదించారు. అటు సీఐడీ తరుపున అడ్వకేట్ జనరల్ ఏజీ శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

అనారోగ్య కారణాల వల్ల చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చినందున.. ఆ గడువు ముగిసే వరకు చంద్రబాబును అరెస్ట్ చేయబోమని ఏజీ శ్రీనివాస్ కోర్టుకు వివరించారు. దీనిపై లిఖిత పూర్వకంగా కోర్టుకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత కోర్టు తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. దీంతో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించినట్లు అయింది. అటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు.

ఇకపోతే చంద్రబాబు జైలుకు వెళ్లినప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు ఆరోగ్యం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూర్ చేయాలని చంద్రబాబు తరుపున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూర్ చేసింది. రూ. లక్ష పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తిరిగి జైలు ఎదుట లొంగిపోయే సమయంలో.. చికిత్స, ఆసుపత్రి వివరాలను జైలు సూపరిండెంట్‌కు సమర్పించాలని కోర్టు సూచించింది.

మధ్యంత బెయిల్ లభించడంతో కాసేపటి క్రితం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రహ్మణి, అచ్చెన్నాయుడు, పెద్ద ఎత్తున టీడీపీ నేతలు జైలు వద్దకు చేరుకొని చంద్రబాబుకు స్వాగతం పలికారు. రాజమండ్రి నుంచి ర్యాలీగా చంద్రబాబు నాయుడు తన నివాసానికి చేరుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =