హస్తిన కేంద్రంగా ఏపీ పొత్తుల లెక్కలు

Jagan Delhi Tour,Political heat, alliances in AP, Calculations,Narendra Modi, Jagan, Chandrababu, Pawan Kalyan, TDP, YCP, Jana Sena, BJP, Congress, Mango News Telugu, Mango News
Jagan Delhi Tour,Political heat, alliances in AP, Calculations,Narendra Modi, Jagan, Chandrababu, Pawan Kalyan, TDP, YCP, Jana Sena, BJP, Congress

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి తిరిగి ఏపీ వచ్చిన దగ్గర నుంచి .. ప్రధాని మోడీని కలిసి జగన్ ఏం చర్చించారు? పొత్తుల గురించా.. లేక పాలనాపరమైన అంశాల గురించా అన్న చర్చ జోరుగా నడుస్తోంది. చంద్రబాబు హస్తినకు వెళ్లి పొత్తుల గురించి చర్చించారు కాబట్టి.. జగన్ కూడా ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్న పొత్తుల గురించే చర్చించి ఉంటారని ప్రచారం జరుగుతోంది.  రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటిమి వైపు వెళ్లొద్దని.. వైసీపీకి 25 పార్లమెంటు స్థానాలు వస్తాయని.. ఇప్పటిలాగే తాము కేంద్రానికి  అన్ని విధాలా సహకారం అందిస్తామని మోడీతో చెప్పి ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే బీజేపీ పెద్దలే ఏపీ సీఎం జగన్‌ను పిలిచారా? లేకపోతే జగన్ నేరుగా వెళ్లి కలిశారా? అన్న విషయంలో మాత్రం బయటకు రాలేదు. నిజానికి షెడ్యూల్ ప్రకారం జగన్ ఫిబ్రవరి 11న ఢిల్లీ వెళ్లాలి. కానీ  రెండు రోజులు ముందుగానే జగన్ ఢిల్లీ వెళ్లి.. కేంద్ర పెద్దలతో మాట్లాడటం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

సాధారణంగా బీజేపీకి సంబంధించి రాజకీయ వ్యూహాలు ఏమైనా సరే అమిత్ షా, జేపీ నడ్డా మాత్రమే చూస్తారు. ప్రధాని మోడీ కేవలం పాలనాపరమైన అంశాలను మాత్రమే పట్టించుకుని దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. పార్టీ గురించి ఏమైనా మాట్లాడాలని ఉంటే.. అమిత్ షా తో మాట్లాడాలని సూచిస్తారు. అయితే తాజాగా ఢిల్లీలో అడుగుపెట్టిన జగన్ కు కేంద్రమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ లభించలేదు. దీంతో ప్రధాని మోడీతో సమావేశానికి జగన్ పరిమితమయ్యారు.

అయితే కేవలం జగన్ ప్రధాని మోడీతోనే  సమావేశమవడం..అందులోనూ  గంటన్నర పాటు చర్చలు జరపడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.  సాధారణంగా ఎన్నికల ముందు, ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సమయంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లి ప్రధానిని కలవడం మామూలే. కానీ ఇప్పుడు చంద్రబాబు వెళ్లాక జగన్ వెళ్లడం,అంతసేపు మాట్లాడంతో జగన్ వ్యూహాత్మకంగానే ప్రధానిని కలిసారన్న టాక్ నడుస్తోంది.

మరోవైపు పాలనాపరమైన అంశాల గురించే జగన్ హస్తినకు వెళ్లినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  పోలవరం ప్రాజెక్టు నిధుల రీయంబర్స్మెంట్, విభజన హామీల్లో భాగంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించే సీఎం చర్చించారని అంటున్నాయి. మొత్తంగా  అనుకున్న దానికంటే ఎక్కువ హీటునే ఏపీ రాజకీయాలు జనరేట్ చేస్తున్నాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =