ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, సుప్రీంకోర్టు ఆదేశాలు

Supreme Court Orders to held Medical Tests for MP Raghu Rama Krishna Raju at Secunderabad Army Hospital,Raghurama Krishnam Raju Case,SC Orders Medical Examination Of Mp Raghurama Krishnam Raju,Raghurama Krishnam Raju Case News,Supreme Court Orders To Conduct Tests At Secunderabad Army Hospital,Sc Orders Fresh Medical Examination Of Raghurama Krishnam Raju,SC Orders Medical Tests For Mp Raghu Rama Krishna Raju,Mango News,Mango News Telugu,Supreme Court,MP Raghu Rama Krishna Raju,MP Raghu Rama Krishna Raju Latest News,MP Raghu Rama Krishna Raju Live Updates,MP Raghu Rama Krishna Raju Medical Tests,Medical Examination of MP Raghu Rama Krishna Raju,MP Raghu Rama Krishna Raju,SC sends YSRC MP to Army Hospital in Secunderabad

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్ పై సోమవారం నాడు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా వాదనలు జరిగాకా, ముందుగా ఎంపీ వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ రఘురామరాజుకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యుడీషియల్‌ అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. అదేవిధంగా వైద్య పరీక్షలను వీడియోతో చిత్రీకరించి, సీల్డ్‌ కవర్‌లో నివేదిక అందజేయాలని ఆదేశించింది. వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చులను మొత్తం ఎంపీ రఘురామకృష్ణరాజు భరించాలని కోర్టు పేర్కొంది. ఇక బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 3 =