మచిలీపట్నంలో సెగ్మెంట్ స్పెషాలిటీ అదే

The segment specialty, Machilipatnam,Machilipatnam,Jagan, Congress, TDP, YCP, BJP,Simhadri Satyanarayana, Balashauri, Pardasaradi, Dr. Simhadri Chandrasekhar,AP Elections,Mango News Telugu,Mango News,AP
The segment specialty, Machilipatnam,Machilipatnam,Jagan, Congress, TDP, YCP, BJP,Simhadri Satyanarayana, Balashauri, Pardasaradi, Dr. Simhadri Chandrasekhar

కొత్త ముఖాలకు మచిలీపట్నం నియోజకవర్గం కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఇంతకు ముందు జరిగిన ఎన్నికలలో కూడా చాలా మంది  ఇక్కడ నుంచి  పోటీ చేసే సమయానికి కొత్త ముఖాలే. తాజాగా  మచిలీపట్నం పార్లమెంటు కోసం  వైఎస్సార్సీపీ అభ్యర్థులని ప్రకటించింది.లోక్ సభ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ పోటీలో నిలబడబోతున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. వైఎస్సార్సీపీ వ్యూహం మార్చుతూ ప్రకటించిన ఎంపీ అభ్యర్థి  కొత్త ముఖం కావడంతో మరోసారి మచిలీపట్నం హాట్ టాపిక్ అయింది.

ఇటు మచిలీపట్నం లోక్‌సభ సెగ్మెంట్ నుంచి వైఎస్సీర్సీపీ అభ్యర్థిగా మాజీ దేవాదాయ శాఖ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కొడుకు, ఫేమస్ కేన్సర్‌ స్పెషలిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌ పేరును అధిష్టానం  ప్రకటించింది. చంద్రశేఖర్‌ రాక వల్ల మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లపై సానుకూల ప్రభావం పడుతుందని పేర్ని నాని అన్నారు.

ఇక మొదటి నుంచి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న వైసీపీ అధినేత జగన్ ..మచిలీపట్నం ఎంపీ విషయంలోనూ అంతే వ్యూహాత్మకంగా  పావులు కదిపారు. ఇలా మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థులుగా మూడు ఎన్నికల్లోనూ ముగ్గురు కొత్త ముఖాల్ని జగన్ బరిలోకి దింపారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన కొనకళ్ల   నారాయణపై.. మాజీ మంత్రిగా పని చేసిన పార్థసారథిని బీసీ అభ్యర్థిగా మచిలీపట్నం బరిలో నిలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి సామాజిక సమీకరణాలతో గుంటూరు జిల్లాకు చెందిన వల్లభనేని బాలశౌరిని..వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దించి విజయాన్ని సాధించారు. ఇప్పుడు..ఇప్పటి వరకూ ప్రత్యక్ష రాజకీయాల్లో  ఎలాంటి అనుభవం లేని చంద్రశేఖర్‌ను పోటీకి దింపుతున్నారు.

కొత్త అభ్యర్థి అయితే సక్సెస్‌ అవుతారన్న ఫార్ములాను రిపీట్ చేస్తూ.. 2024 ఎన్నికల కోసం చంద్రశేఖర్‌ను బరిలోకి దించారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వేల ఆధారంగా.. జగన్‌ భారీ ఎత్తున అభ్యర్థుల మార్పులు చేర్పులు చేయడంతో పార్థ సారథి టీడీపీ, బాల శౌరి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతున్న బాలశౌరి..వైఎస్సార్సీపీకి చెందిన సింహాద్రి చంద్రశేఖర్‌తో తలపడబోతున్నారు.

సాధారణంగా ఎన్నికల్లో అభ్యర్థులను మార్చడం అనేది సహజమే.కానీ మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా మూడు సార్లు ముగ్గురు కొత్త ముఖాలను అభ్యర్థులుగా వైసీపీ అధినేత బరిలో నిలిపారు .  2014 పార్థ సారథి , 2019 బాల శౌరి, 2024 లో చంద్ర శేఖర్‌ను ప్రకటించిన జగన్..మూడు సార్లు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కొత్త ముఖాలనే పోటీలో దింపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one − 1 =