అప్పుడు టీడీపీ..ఇప్పుడు బీజేపీ

Those Two Leaders Entered The Ring For The First Time, Those Two Leaders Entered The Ring, Those Two Leaders First Time Entered, First Time Those Two Leaders Entered, BJP, Chandrababu, Lokesh, TDP, Janasena, Congress, YCP, BJP, Pawan Kalyan,CM Ramesh, Sujana Chowdary, Mango News, Mango News Telugu
BJP, Chandrababu, Lokesh, TDP, Janasena, Congress, YCP, BJP, Pawan Kalyan,CM Ramesh, Sujana Chowdary

రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్  పార్లమెంటు అభ్యర్థులుగా బరిలో  దిగడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు టీడీపీ నేతలు అయిన ఈ ఇద్దరూ తర్వాత  కాషాయపార్టీలో చేరారు.అయితే ఇప్పుడు వారి రాజకీయ జీవితంలోనే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీలో నిలబడుతున్న అవకాశాలు కనిపిస్తున్నట్లు వార్తలు వినపిస్తున్నాయి.

సుజనా చౌదరి, సీఎం రమేష్‌ టీడీపీకి  ఒకప్పుడు నమ్మకమైన నేతలుగా ..ఆ పార్టీకి వెన్నుదన్నుగా… బ్యాక్ ఆఫీస్ లో ఉంటూ  అన్ని రకాలుగా సాయం అందించేవారు. ఆర్థికంగా,  సామాజికవర్గం పరంగా కూడా   వీరిద్దరూ బలమైన నేతలు. తెలుగు దేశం పార్టీకి  ఆర్థికంగా వెనక ఉండి సాయం అందిస్తూనే తాము వ్యాపారపరంగా లబ్ది పొందేవారు. కానీ చంద్రబాబును ఎప్పుడూ తమకు రాజకీయాల్లో స్థానం కల్పించాలంటూ అడగలేదు.

2014, 2019 ఎన్నికల్లో  అభ్యర్థుల ఎంపికలోనూ వాళ్లిద్దరూ  కీలకంగానే ఉన్నారు. సుజనా చౌదరి  స్క్రీనింగ్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక  రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీళ్లిద్దరూ బీజేపీలో చేరిపోయారు. సుజనా చౌదరిది కృష్ణా జల్లా. కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకుడే కాకుండా  ఆర్థికంగా కూడా బలమైనవారు. దీంతో ప్రత్యక్ష ఎన్నికలలో నిలబడాలని సన్నిహితులు సూచనతో ఈ సారి ఏలూరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి  ఎన్నికల బరిలో దిగడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉండటంతో..తమ గెలుపు గ్యారంటీ అని సుజనా చౌదరి నమ్ముతున్నారు. అయితే విజయవాడను వదులుకోవడానికి టీడీపీ సిద్ధపడకపోవడంతో  ఏలూరు అయితే బెటరని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి.. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి సుజనా పోటీ చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

కాపు సామాజికవర్గానికి చెందిన సీఎం రమేష్..  కడప జిల్లాకు చెందిన నేత. తెలుగుదేశం పార్టీకి  ఆర్థికంగా ఎన్నో సార్లు వెన్నుదన్నుగా నిలిచారు. చంద్రబాబుకు నమ్మకంగా ఉండేవారు. రమేష్ కూడా ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఆయన కూడా సుజనా చౌదరిలాగే ఈసారి ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయడానికి  రెడీ అవుతున్నారు.

అయితే అనకాపల్లి స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా  కొణిదెల నాగబాబు బరిలోకి దిగాలనుకున్నా కూడా.. ఆ స్థానాన్ని బీజేపీ కోరడంతో నాగబాబు పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అనకాపల్లి నుంచి సీఎం రమేష్  పోటీ చేయడానికి రూట్ క్లియర్ అవడంతో ఆయన ఎన్నికల బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =