పెమ్మ‌సాని ఫోక‌స్ పెడితే.. ప్ర‌త్య‌ర్థికి క‌ష్ట‌మేనా?

If Pemmasani Chandrasekhar Focuses... Will It Be Difficult For The Opponent?, If Pemmasani Chandrasekhar Focuses, Pemmasani Chandrasekha Difficult For The Opponent, Pemmasani Chandrasekhar Focuses Guntur, Pemmasani Chandrasekhar, TDP, AP Politics, Guntur TDP MP Candidate, Guntur Political News, Latest Guntur News, AP Elections, CM Jagan, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
If Pemmasani Chandrasekhar Focuses... Will It Be Difficult For The Opponent?, If Pemmasani Chandrasekhar Focuses, Pemmasani Chandrasekha Difficult For The Opponent, Pemmasani Chandrasekhar Focuses Guntur, Pemmasani Chandrasekhar, TDP, AP Politics, Guntur TDP MP Candidate, Guntur Political News, Latest Guntur News, AP Elections, CM Jagan, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu

ఆంధ‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కీల‌క‌మైన జిల్లా గుంటూరు. రాజ‌ధాని అమ‌రావ‌తి ఆ  ప్రాంతం ప‌రిధిలోనే ఉంది. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా త‌ర్వాత గుంటూరు జిల్లానే పెద్ద‌ది. అందుకే గుంటూరు రాజ‌కీయాలు మిర్చిలానే ఎప్పుడూ ఘాటుగానే ఉంటాయి. అక్క‌డి నాయ‌కులు కూడా అంతే. బ‌రిగీసి రంగంలోకి దిగారంటే చాలు.. అవ‌త‌లి వ్య‌క్తి ఎంత తోపు అయినా..  నువ్వా.. నేనా.. సై.. అంటూ ప్ర‌త్యర్థుల‌తో త‌ల‌ప‌డ‌తారు. గుంటూరు లోక్‌స‌భ నుంచి తెలుగుదేశం కూట‌మి అభ్య‌ర్థిగా పోటీలో దిగిన డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ కూడా ఇప్పుడు అదేతీరు అవ‌లంభిస్తున్నారు. గుంటూరు రాజ‌కీయాల్లోకి ప్ర‌త్య‌క్షంగా అడుగుపెట్టిన కొద్దినెల‌ల‌కే ఆయ‌న పేరు రాష్ట్రమంతా మార్మోగుతుంది. సోష‌ల్‌మీడియాలో ఆయ‌న‌పై పుంఖాలు పుంఖాలుగా క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.

గుంటూరు జిల్లాలో రాజ‌కీయ ఉద్దండులుగా పేరున్న నేత‌లు అనేక మంది ఉన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ, తెలుగుదేశం మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌రిగినా.. తెలుగేదేశంకు జిల్లాలో  బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. ఒక‌టిరెండు ఎన్నిక‌లు మిన‌హా.. ఉమ్మ‌డి గుంటూరు జిల్లా టీడీపీకి కంచుకోట అని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు.   రెండు నెల‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌నేప‌థ్యంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల అధిష్టానాలు గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి సారించాయి. రాష్ట్రం విడిపోయిన  త‌రువాత జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లోనూ గుంటూరు నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా గ‌ల్లా జ‌య‌దేవ్ బ‌రిలో నిలిచి విజ‌యం సాధించారు. తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నారు. దీంతో గుంటూరు పార్ల‌మెంట్ నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దింప‌డం ద్వారా హ్యాట్రిక్ విజ‌యం సాధించాల‌ని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్ర‌మంలో.. స్థానిక‌ంగా ప్ర‌జ‌ల్లో మంచిపేరున్న బుర్రిపాలెం వాస్త‌వ్యుడు డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌ను ఎంపిక చేశారు. ఇక అప్ప‌టి నుంచీ గుంటూరు రాజ‌కీయాల్లో వేడి పెరిగింది.

ఫోక‌స్ పెట్టిన ఏ రంగంలో అయినా.. పెమ్మ‌సాని స‌క్సెస్ సాధించారు. అదే స‌క్సెస్ కోసం రాజ‌కీయాల‌పైనా ఇప్పుడు పూర్తిగా ఫోక‌స్ పెట్టారు. ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీలో ఉండి.. అధికారపార్టీ వైసీపీని చెడుగుడు ఆడుతున్నాడు.. భ‌విష్య‌త్‌లో తాను అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌తిప‌క్ష వైసీపీకి చుక్క‌లే అని ఇప్ప‌టి నుంచే హెచ్చ‌రిస్తున్నాడు. ఆయ‌న రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తున్న విశ్లేష‌కులు.. పెమ్మ‌సాని అధికారంలోకి రావ‌డం నిజంగానే ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇప్ప‌టికే లోక్‌స‌భ ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. పెమ్మ‌సాని ప‌ర్య‌టించారు. వెళ్లిన ప్ర‌తిచోటా.. ఆయ‌న‌కు అపూర్వ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇటీవ‌ల తెనాలి ప‌ట్ట‌ణం అయితే.. ద‌ద్ద‌రిల్లిపోయింది. దీంతో పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని టీడీపీ, జ‌న‌సేన పార్టీల్లోని కిందిస్థాయి నుంచి జిల్లా స్థాయి నేత‌ల వ‌ర‌కు పెమ్మ‌సాని అంటే మంచి ఆద‌ర‌ణ చూపుతున్నారు. ఇటీవ‌ల బీజేపీ కార్య‌క‌ర్త‌లు కూడా ఆయ‌న‌కు తోడుగా న‌డుస్తున్నారు. తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో గుంటూరు పార్ల‌మెంట్ నుంచి పెమ్మ‌సాని విజ‌యం న‌ల్లేరుపై న‌డేకేన‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =