ప్రభాస్‌ బర్త్‌డే స్పెషల్: ‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’ ‌మోషన్‌ పోస్టర్‌ విడుదల

Beats Of Radhe Shyam Motion Poster, Beats Of Radhe Shyam Motion Poster Released, Prabhas Birthday, Prabhas Birthday Special, Radhe Shyam, Radhe Shyam Motion Poster, Radhe Shyam Motion Poster Released, Radhe Shyam Movie, Radhe Shyam Movie Updates, Rebel Star Prabhas Birthday Special

రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్ర‌భాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా రాధే శ్యామ్ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం నాడు రాధే శ్యామ్ చిత్ర యూనిట్ ఫస్ట్ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘బీట్స్‌ ఆఫ్‌ రాధే శ్యామ్‌’ పేరుతో విడుదలైన ఈ మోషన్ పోస్టర్‌ అభిమానులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మోషన్ పోస్టర్ విడుదలతో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానుల కోలాహలం నెలకుంది.

పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ ప్రేమకథా చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్, యువీ క్రియేషన్స్ మరియు టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో ఈ చిత్రం ఒకేసారి చిత్రీకరణ జరుపుకుంటుంది. సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి పులికొండ, భాగ్యశ్రీ, మురళి శర్మ, కునాల్ రాయ్ కపూర్, రిద్ది కుమార్, సాశా చెత్రి, సత్యన్ తదితరులు నటిస్తుండగా, జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు.

‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’ మోషన్ పోస్టర్‌:

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here