బీహార్ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది : సీఎం నితీశ్ కుమార్

Third Wave of Covid-19 has Started in Bihar, Bihar CM Nitish Kumar, Mango News, Mango News Telugu, Bihar Third Wave of Covid-19, bihar third wave of coronavirus cases, third wave of covid-19 cases in bihar, coronavirus outbreak in bihar, bihar covid-19 pandemic, bihar chief minister nitish kumar, coronavirus cases in india, covid-19 pandemic in india, bihar coronavirus cases

బీహార్ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ఆల్రెడీ ప్రారంభమైందని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగడమే దీనికి నిదర్శనమని ఆయన చెప్పారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా విపరీతంగా పెరగటం పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లతో పాటు పలు దక్షిణాది రాష్ట్రాలలో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ వ్యాఖ్యలు ఇపుడు సంచలనం అయ్యాయి.

ముఖ్యంగా.. బీహార్ రాష్ట్రంలో కరోనా మూడో దశ వ్యాప్తి మొదలైందని సీఎం నితీశ్ కుమార్ తేల్చి చెప్పారు. బుధవారం ఆయన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సీఎం నితీశ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 47 కోవిడ్ కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో థర్డ్ వేవ్ ప్రారంభమైనట్టుగా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేసినా.. మన రాష్ట్రంలో ఇంకా అలాంటి పరిస్థితులు రాలేదన్నారు. ఒకవేళ పాజిటివ్ కేసులు మరింత పెరిగితే మాత్రం, నైట్ కర్ఫ్యూను అమలు చేసే అంశం గురించి ఆలోచిస్తామని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + one =