కృత్రిమ చేప మాంసం.. దేశంలోనే తొలి ప్రాజెక్ట్

Artificial fish, Artificial fish meat, country, CMFRI, The first project in the country, fish meat,Fish meat production, ICAR-CMFRI, seafood, Cultivated meat, Artificial Meat, Latest Technology Updates, Nation's First 'Lab, Mango News Telugu, Mango News
CMFRI,Artificial fish meat, The first project in the country, fish meat,Fish meat production

టెక్నాలజీ డెవలప్ అయి కోరుకున్న వస్తువే కాదు..  కోరుకున్న రుచినీ కూడా పొందొచ్చంటూ నాన్ వెజ్ లవర్స్ కోసం గుడ్ న్యూస్  వినిపిస్తోంది. సీఫుడ్‌కు గిరాకీ పెరుగుతుండటంతో.. భారతదేశంలోనే తొలిసారి ల్యాబ్‌లో చేప మాంసాన్ని ఉత్పత్తి చేయడానికి సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒక కీలక ప్రాజెక్ట్ చేపట్టింది.

సీఫుడ్‌కు గిరాకీ పెరుగుతుండటంతో దానికి అనుగుణంగా సరఫరాను పెంచడమే ఈ ప్రాజెక్ట్  ముఖ్య ఉద్దేశం. దాని వల్ల సముద్రజీవుల సమతౌల్యాన్ని కూడా కాపాడినట్లు అవుతుందని సీఎంఎఫ్‌ఆర్‌ఐ తెలిపింది.  చేపల నుంచి వేరు చేసిన కణాలను స్పెషల్‌గా ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో డెవలప్ చేసి.. చేప మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు సీఎంఎఫ్‌ఆర్‌ఐ  ప్రకటించింది.

ఈ మీట్  రంగు, రుచి, పోషకాలు నిజమైన చేపలాగే  ఉంటాయని సీఎంఎఫ్‌ఆర్‌ఐ తెలిపింది. అయితే,ఈ ప్రాజెక్ట్ తొలి దశలో కింగ్‌ ఫిష్‌, చందువా చేప, వంజరం మాంసాన్ని అభివృద్ధి చేస్తామని సీఎంఎఫ్‌ఆర్‌ఐ తెలిపింది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ,ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టనున్నట్లు  ప్రకటించింది.

దీని కోసం ఆర్టిఫిషియల్ మీట్ తయారీ అంకుర సంస్థ.. నీట్‌ మీట్‌ బయోటెక్‌తో చేతులు కలిపినట్లు వెల్లడించింది. దీనిపై రెండు  సంస్థలు కలిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎంఎఫ్‌ఆర్‌ఐ వివరించింది. ఈ రెండు  సంస్థల ఒప్పందం ప్రకారం.. అధిక విలువ కలిగిన సముద్ర చేప జాతుల ప్రారంభ సెల్‌లైన్‌ డెవలప్మెంట్‌పై  పరిశోధన చేస్తున్నట్లు సీఎంఎఫ్‌ఆర్‌ఐ  చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత పరిశోధన, అభివృద్ధి కోసం చేప కణాలను వేరు చేసి పెంపకం చేపడుతున్నట్లు సీఎంఎఫ్‌ఆర్‌ఐ చెప్పింది. అలాగే జన్యు, జీవ రసాయనపరమైన అంశాలను విశ్లేషించడానికి తమ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని సీఎంఎఫ్‌ఆర్‌ఐ ప్రకటించింది. దీనికోసం ఇన్‌స్టిట్యూట్‌లో అన్ని సౌకర్యాలతో సెల్‌ కల్చర్‌ లేబొరేటరీని ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

మరోవైపు సెల్‌ కల్చర్‌ టెక్నాలజీలో స్కిల్ ఉన్న.. నీట్‌ మీట్‌ బయోటెక్,సెల్‌ గ్రోత్‌ మీడియా ఆప్టిమైజేషన్‌,సెల్‌ అటాచ్‌మెంట్‌ బయోరియాక్టర్ల ద్వారా.. ఉత్పత్తి వంటి కార్యకలాపాలను కూడా  చేపడుతున్నట్లు సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =