ఏపీ విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఇకపై స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారి నియామకం

CM YS Jagan Held Review on Educational Department Orders Officials To Provide Internet For All Schools, CM YS Jagan Orders Officials To Provide Internet For All Schools, Review on Educational Department, Educational Department, AP Educational Department, Internet For All Schools, school education department, AP Educational Department Review, Educational Department Review News, Educational Department Review Latest News, Educational Department Review Latest Updates, AP CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌శర్మ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్ రాష్ట్రంలోని పాఠశాలల పరిస్థితి, విద్యాపరంగా పాటించాల్సిన ప్రమాణాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. సమావేశంలో సీఎం జగన్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు..

  • ఏపీలో స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్ణయం.
  • రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలి.
  • వర్షాకాలం నేపథ్యంలో స్కూళ్లలో జాగ్రత్తలు పాటించాలి, అలాగే ఎక్కడ ఎలాంటి మరమ్మత్తు వచ్చినా వెంటనే సరిదిద్దాలి.
  • అలాగే వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్‌ చివరి నాటికే సిద్ధం చేయాలని ఆదేశం.
  • ఇచ్చిన హామీ మేరకు ఆలస్యం చేయకుండా వెంటనే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను అందించే ఏర్పాటు చేయాలి.
  • ఇంకా ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోధన కోసం ముందుగా నాణ్యమైన టీవీలు ఏర్పాటు చేయాలి.
  • అలాగే ఆపై దశల వారీగా అన్ని తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేయాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 15 =